Coolie : వైరల్ అవుతున్న ‘రజిని’ మాస్ మేకోవర్ లుక్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే?

Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ – టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో “కూలీ” అనే సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. పక్కా లోకి మార్క్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక రజిని సినిమా అంటే పాన్ ఇండియా వైడ్ గా ఎలాంటి అంచనాలు నెలకొని ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే లోకేష్ కానగరాజ్ సినిమాకు కూడా విక్రమ్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ పెరిగింది. వీళ్ళ కాంబోలో సినిమా వస్తుంది అనగానే అప్పుడే సాలిడ్ క్రేజ్ పెరిగింది. ఇక రీసెంట్ గా రజినీకాంత్ ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేయగా, అభిమానులకు వింటేజ్ లుక్ ను రజినీకాంత్ ను గుర్తు చేశారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కి “కూలీ” అని క్యాచీ మాస్ టైటిల్ ని పెట్టడం వల్ల పాన్ ఇండియా వైడ్ గా అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ నెలకొని ఉంది. ఇదిలా ఉండగా తాజాగా కూలీ సినిమా నుండి రజినీకాంత్ పాత్రకి సంబంధించి క్రేజీ లుక్ వైరల్ అవుతుంది.

Rajinikanth Coolie movie new look viral on social media

కూలీ కోసం రజిని మాస్ మేకోవర్..

ఇక కూలీ (Coolie) మూవీ సెట్స్ లో ఉన్న రజినికాంత్ సరికొత్త లుక్ తాలూకు స్టిల్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆ స్టిల్ లో మేకప్ రూమ్ లో రజినీకాంత్ సినిమాకి సంబంధించి మాస్ లుక్ తో డిఫరెంట్ మేకోవర్ రెడీ అవగా, ఆ స్టిల్ ని లోకేష్ కానగరాజ్ తీస్తున్నట్టు పిక్ లో ఉంది. ఇక ఈ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. స్టిల్ లో రజనీకాంత్ నలుపు రంగు షర్ట్ వేసుకోగా, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక కూలీ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇప్పటికే సగభాగానికి పైగా షూటింగ్ పూర్తయింది. ఇక కూలి సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే నెలలో ఉండబోతుంది. బహుశా జులై రెండో వారం నుండి రెగ్యులర్ షూట్ ముంబైలో జరగనున్నట్టు టాక్ నడుస్తుంది.

- Advertisement -

స్మగ్లింగ్ నేపథ్యంలో కూలీ…

ఇక ఆమధ్య రిలీజ్ చేసిన కూలీ టీజర్ ద్వారా సినిమా బంగారం స్మగ్లర్ల ముఠా కి సంబంధించిన నేపథ్యంతో కథ నడుస్తుందని తెలుస్తుంది. ఇక రిలీజ్ చేసిన టీజర్ లో కూలీ బంగారం స్మగ్లింగ్ నే మెయిన్ గా చూపిస్తున్నారని తెలుస్తుంది. ఇంతకు ముందు సినిమాల్లో డ్రగ్స్ నేపత్యాన్ని బాగా చూపించగా, ఇందులో బంగారం చూపిస్తున్నారు. ఇక ఇంతవరకు వచ్చిన అప్డేట్స్, అలాగే టీజర్ ని చూస్తుంటే లోకి యూనివర్స్ కి లింక్ చేసినా చేయొచ్చని అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మైక్ మోహన్ విలన్ గా నటిస్తుండగా, మలయాళ స్టార్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్, రాఘవ లారెన్స్, విజయ్ సేతుపతి, బాలీవుడ్ నుండి రణవీర్ సింగ్ కూడా కీలక పాత్రలో నటించనున్నాడట. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘కూలీ’ మూవీ పాన్ ఇండియా భాషలతో పాటు, జాపనీస్ లో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు