Directors in Kalki 2898 AD : జక్కన్న, ఆర్జీవీ మాత్రమే కాదు మరో డైరెక్టర్ కూడా… నాగీ మావా నువ్వు మామూలోడివి కాదు

Directors in Kalki 2898 AD : భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి 2898 ఏడి ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. అయితే సినిమాలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక్కో పాత్రతో ఒకో అద్భుతం క్రియేట్ చేశాడు. అందులో భాగంగానే ఇండియన్ సినిమా చరిత్రలో ముఖ్యమైన ఇద్దరు స్టార్ డైరెక్టర్లను వాడుకున్నారు. అలాగే మరో యంగ్ డైరెక్టర్ తో సినిమాలో సర్ప్రైజ్ ఇచ్చారు నాగ్ అశ్విన్. మరి కల్కి మూవీలో జక్కన్న, ఆర్జీవితో పాటు మెరిసిన మరో డైరెక్టర్ ఎవరో తెలుసుకుందాం పదండి.

ప్రభాస్ కు పోటీగా రాజమౌళి…

డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి కథనాన్ని నడిపిన తీరు సినీ విశ్లేషకులను సైతం అబ్బురపరుస్తోంది. సినిమాలో అక్కడక్కడా కొన్ని మైనస్ లు ఉన్నప్పటికీ ప్రతి క్యారెక్టర్ కు ఒక్కో క్రేజీ యాక్టర్ ను ఎంచుకొని అక్కడే సగం సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. అందులో భాగంగానే టాలీవుడ్ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శక దిగ్గజం రాజమౌళిని కూడా రంగంలోకి దించారు. ఈ సినిమాలో రాజమౌళి పోషించిన పాత్ర ఏంటో తెలిస్తే పిచ్చెక్కిపోతారు. ఏకంగా ప్రభాస్ కి పోటీగా ఆయనను నిలిపారు డైరెక్టర్ నాగి. ఈ సినిమాలో రాజమౌళి గెస్ట్ రోల్ చేశారు. ఆయన కనిపించింది కొన్ని నిమిషాలే అయినప్పటికీ థియేటర్లు దద్దరిలేలా చేశారు. ఆల్మోస్ట్ ప్రభాస్ పాత్రను పోలినట్టే రాజమౌళి పాత్ర కూడా ఉండడం విశేషం. అయితే ఆయన క్యారెక్టర్ రివీల్ చేస్తే సినిమాను స్పాయిల్ చేసినట్టుగా అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రస్తావించట్లేదు.

Kalki 2898 AD: ఇది తెలుసా?.. 'కల్కి 2898 ఏడీ'లో స్టార్ డైరెక్టర్లు! - NTV Telugu

- Advertisement -

వివాదాస్పద డైరెక్టర్ గెస్ట్ అప్పియరెన్స్

ఇక ఈ సినిమాలో మెరిసిన మరో డైరెక్టర్ ఆర్జీవి. ఇప్పుడంటే ఆయనను వివాదాస్పద డైరెక్టర్ అని పిలుచుకుంటున్నాం గాని ఒకప్పుడు తెలుగు సినిమా డైనమిక్స్ ను మార్చేసిన ఘనత టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జీవిదే. శివ లాంటి సినిమాలతో ఆయన అప్పట్లోనే తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో నిరూపించారు. ఇక కల్కి 2898 ఏడి మూవీలో రాజమౌళితో పాటు రాంగోపాల్ వర్మ కూడా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఆయన ఈ సినిమాలో చింటూ అనే పాత్రలో కనిపించారు.

మరో డైరెక్టర్ క్రేజీ రోల్..

ఇక వీళ్ళిద్దరితోపాటు ఈ సినిమాలో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసిన మరో యంగ్ డైరెక్టర్ అనుదీప్. ఈ డైరెక్టర్ చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా జాతి రత్నాలు సినిమాతో అనుదీప్ ప్రత్యేకంగా గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే నిన్న మొన్నటిదాకా కల్కి మూవీలో రాజమౌళి, ఆర్జీవి మాత్రమే ఈ సినిమాలో నటించారు అని లీక్స్ వచ్చాయి. కానీ అనుదీప్ గురించి మాత్రం ఎక్కడా కనీసం ప్రస్తావన కూడా రాలేదు. దీంతో ఊహించని విధంగా ఆయన వెండితెరపై మెరవడంతో అదో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అయింది ప్రేక్షకులకు. సినిమాలో వీరితో పాటే దర్శకుడు కం నటుడు అవసరాల శ్రీనివాస్, కమల్ కూడా కొన్ని సినిమాలను డైరెక్ట్ చేయడంతో మొత్తంగా 5 ఐదుగురు డైరెక్టర్స్ ఉన్నట్టు. మొత్తానికి ఇలా క్రేజీ డైరెక్టర్లను ప్రేక్షకులను మెప్పించగలిగేలా చూపించడం అన్నది నాగ అశ్విన్ కు మాత్రమే సాధ్యమైంది. దీంతో నాగీ మామ నువ్వు మామూలోడివి కాదు అంటూ ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు మూవీ లవర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు