Kalki 2898 AD: ఆ ఓటీటీలోకే ‘కల్కి’​.. డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చిన్న వయసులోనే దివంగత నటుడు కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ప్రభాస్ వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోగా కొనసాగాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ సినిమా అనంతరం ప్రభాస్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898 ఏడీ.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజున రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా కోసం ఎన్నో రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఈ సినిమాని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా దాదాపుగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలోనే కాకుండా మొత్తంగా కలిపి 4వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. అలాగే విదేశాల్లోనూ 4500కు పైగా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయింది.

ఇక ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, శోభన, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, అన్నా బెను వంటి పలువురు స్టార్ నటినటులు కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాని దాదాపు 600 కోట్లకు పైగా బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మించారు. ప్రస్తుతం ఎక్కడా చూసిన కల్కి ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామా నేపథ్యంలో రూపొందించారు. ఇక ఈ సినిమా భారీ కనెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

- Advertisement -

Kalki 2898AD Twitter Review : Is 'Kalki' a hit? How is the movie?

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల వివరాల గురించి అందరికీ తెలిసిపోయాయి. ప్రముఖ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఈ సినిమాకు సంబంధించిన రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. థియేటర్స్ లో కూడా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ప్రైమ్ వీడియో అని ఈ సినిమా టైటిల్ కార్డ్స్ ముందు వేశారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర బైరవ, సూపర్ కార్ బుజ్జి ప్రధాన పాత్రలుగా బుజ్జి అండ్ భైరవ పేరుతో ఒక వెబ్ సిరీస్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇక ఏది ఏమైనప్పటికీ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా పండగ వాతావరణాన్ని తెచ్చింది. ఇక ఎంతోమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాని చూస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు