Kalki 2898 AD : ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ కల్కి.. ఈ సినిమా మేనియా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుంది.. కల్కి సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ , లెజండరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది.. పురాణాలను లింక్ చేస్తూ ఆధునిక ప్రపంచం ఎలా ఉండబోతుందనేది నాగ్ ఈ సినిమాలో చూపించాడు.. కొద్ది గంటల క్రితం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..
సినిమా బాగుందనే టాక్ ను అందుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవని చెప్పాలి.. సినిమాలో చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. ఇక కల్కి సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు నటించారని ముందు నుంచి వార్తలు వచ్చాయి. దీంతో సినిమా ఇప్పటికే అనేక షోలు పడటంతో సినిమాలో ఎవరెవరు నటించారో బయటకు వచ్చేసింది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రకు న్యాయం చేశారు.. నాగ్ అశ్విన్ అందరికీ ప్రాధాన్యత ఇచ్చాడు.. అయితే నాగీ ఓ తప్పు చేసాడనే వార్తలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి..
కల్కిలో ఇప్పటివరకు దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్స్ ఉన్నట్లు ట్రైలర్, టీజర్ల లో చూపించారు.. అయితే ఇందులో ముఖ్య పాత్రలు కాకుండా.. ఆర్జీవీ, రాజమౌళి, అనుదీప్, ఫరియా అబ్దుల్లా, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల అలా కనిపించి ఇలా వెళ్ళిపోతారు. మృణాల్ ఠాకూర్ ఓ చిన్న పాత్రలో మెప్పిస్తుంది. విజయ్ దేవరకొండ ఎవరూ ఊహించని మహాభారతంలోని ఓ పాత్రలో అదరగొట్టేసాడు. దుల్కర్ సల్మాన్ ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మెప్పిస్తాడు.. అందరి పాత్రలు పర్వాలేదు కానీ డైరెక్టర్ రాజమౌళి, ఆర్జీవి, అనిరూద్ రోల్స్ మాత్రం అవసరం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.. నాగీ అందరిని హైలెట్ చేశాడు.. వీరి ముగ్గురిని సరిగ్గా వాడుకోలేదని జనాలు అంటున్నారు.. మొత్తంగా సినిమా మాత్రం సూపర్ హిట్ అనే టాక్ ను అందుకుంది.. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..