Rashmika Mandanna : రష్మిక చేసిన పనికి ఫ్యాన్స్ షాక్.. అస్సలు నమ్మలేరు..

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమా ఛలో తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా మంచి టాక్ ను అందుకోవడంతో వరుస సినిమాలు క్యూ కట్టాయి.. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అవ్వడం మాత్రమే కాదు నేషనల్ క్రష్ అనే పేరును అందుకుంది.. ప్రస్తుతం బీటౌన్ లో తన హవాను కొనసాగిస్తుంది.. అయితే చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది.. తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

రష్మిక క్రేజ్ ఇప్పుడు ఓ రేంజులో ఉంది.. బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.. ఆ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.. ఆ తర్వాత మరో సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది.. బాలీవుడ్ సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.. అలాగే బాలీవుడ్ లో మరో సినిమాలో నటిస్తుంది… విక్కీ కౌశల్ జోడిగా నటిస్తుంది.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ధనుష్ కుబేర సినిమాలో కూడా నటిస్తుంది.. తెలుగులో పుష్ప 2 సినిమాలో నటిస్తుంది.. వీటితో పాటుగా ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో అనే సినిమాల్లో కూడా నటిస్తుంది..

Rashmika Mandanna funny video viral in social
Rashmika Mandanna funny video viral in social

ఏకంగా ఆరు, ఏడు సినిమాల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో నిత్యం చూస్తూనే ఉంటాం.. ఈ అమ్మడు పెట్టిన ఫోటోలు క్షణాల్లో ఎంత వైరల్ అవుతుంటాయో.. తాజాగా ఫన్నీగా ఉండే ఓ వీడియోను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.. ఆ వీడియో రష్మిక క్యారీవ్యాన్ లో ఉంది.. ఆ సమయంలో రష్మిక తల మీద పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ కనిపిస్తుంది.. అది చెయ్యడం కాస్త కష్టమే అయినా రష్మిక పూర్తి చేస్తుంది.. ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది.. దాన్ని చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు