Kalki 2898AD : ‘కల్కి’ సినిమాను వీక్షీంచిన సినీ, రాజకీయ ప్రముఖులు..

Kalki 2898AD : పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ ప్రధాన పాత్రలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె వంటి స్టార్స్ ప్రత్యేక పాత్రల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీ కల్కి 2898 ఏడీ. ప్ర‌పంచవ్యాప్తంగా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. మొదటి షో నుంచే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు. రెబల్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా మార్నింగ్ షో చూసేందుకు థియేటర్ల దగ్గర సందడి చేశారు.. అలాగే రాజకీయ నాయకులు కూడా కల్కి సినిమా పై సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు.. ఇప్పటివరకు ఈ సినిమాను వీక్షించిన సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరో ఒకసారి చూద్దాం..

హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో పవన్ కొడుకు అకీరా, రేణు దేశాయ్ సందడి చేశారు.. అభిమానులతో కలిసి సినిమాను చూశారు.. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వీరితో సెల్ఫీలు తీసుకోవడం కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు.. అలాగే అక్కినేని నాగార్జున కూడా సినిమాను వీక్షీంచారు.. ఇక నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు కూడా సినిమాను థియేటర్లలో చూసారు.. యంగ్ హీరోయిన్ నభా నటేష్ కూడా కల్కి సినిమాను వీక్షీంచారు.. ప్రభాస్ పెద్దమ్మ ఐమాక్స్ వద్ద సందడి చేశారు.. సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు కల్కి సినిమా స్పెషల్ షోలను చూశారు..

Movie and political celebrities who watched the movie 'Kalki'..
Movie and political celebrities who watched the movie ‘Kalki’..

అంతేకాదు సినిమా వాళ్లు మాత్రమే కాదు.. రాజకీయ నాయకులు కూడా సినిమాను వీక్షీంచారు.. ఈ సినిమా హిట్ టాక్ ను అందుకోవడం పై ఏపీ మంత్రి నారా లోకేష్ కల్కి పై ప్రశంసల వర్షం కురిపించారు.. సినిమా హిట్టైనందుకు ప్రభాస్‌, అమితాబ్‌, కమల్ హాసన్‌, దీపికా పదుకోన్‌, దర్శకుడు నాగ్ అశ్విన్‌లకు అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకువెళ్లినందుకు చిత్ర నిర్మాతలు అశ్వినీదత్ తో పాటు ఆయన కూతుళ్లు స్వప్న, ప్రియాంకలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు