Comedian AVS.. ప్రముఖ కమెడియన్ ఏవీఎస్.. నేడు మన మధ్య లేకపోయినా ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలను మనకు అందించారని చెప్పవచ్చు.. కామెడీ పండించడంలో.. ఎమోషన్స్ తో కంటి తడి పెట్టించడంలో ఈయన తర్వాతే ఎవరైనా.. ఒక కమెడియన్ మాత్రమే కాదు.. రచయితగా, నిర్మాతగా , దర్శకుడిగా , పాటల రచయితగా కూడా అనేక సినిమాలో పనిచేసి.. టాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్నారు.. ముఖ్యంగా బ్రహ్మానందం – ఏవీఎస్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోతారనటంలో సందేహం లేదు. ఇకపోతే నటుడిగా వెండితెరపై సందడి చేస్తూ ఎంతో సరదాగా కనిపించిన ఈయన.. 2013లో తీరని లోకాలకు వెళ్లిపోయారు.. అయితే ఏవీఎస్ కుటుంబం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ముఖ్యంగా ఆయన కూతురు, అల్లుడు కూడా నటీనటులే.. తెలుగు ఆడియన్స్ కి చాలా సుపరిచితమైన వారు కూడా… వారిద్దరూ కమెడియన్ ఏవీఎస్ కూతురు, అల్లుడు అని ఎవరికి పెద్దగా తెలియదని చెప్పవచ్చు..
ఏవీఎస్ కూతురు కూడా నటే..
మరి ఏవీఎస్ కూతురు ఎవరో కాదు శ్రీ ప్రశాంతి. బుల్లితెరపై సీరియల్స్ చూసే వారికి ఈమె గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు.. ఎన్నో సీరియల్స్ లో కీలక పాత్రలు పోషించి.. బుల్లితెర ఆడియన్స్ కి మరింత దగ్గర అయింది. ప్రస్తుతం చాలా సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా మారింది.. అంతేకాదు పలు సినిమాలలో కీలకపాత్రలు కూడా పోషించింది ఈ ముద్దుగుమ్మ.. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.. అందులో తన ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకోవడమే కాదు తండ్రితో కలిసి ఉన్న తన జ్ఞాపకాలను కూడా యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రీల్స్ కూడా పెడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె బుల్లితెర నటుడు శ్రీనివాస్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఏవీఎస్ అల్లుడు కూడా నటుడే..
శ్రీనివాస్ విషయానికి వస్తే.. ఈయన తెలుగు, తమిళ్ భాషలో అనేక సినిమాలు సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. అంతేకాదు విలన్ గా కూడా పనిచేశారు.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో సినీ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు శ్రీనివాస్ అలియాస్ చింటూ.. ఈ చింటూ అవును చిత్రంలో కూడా నటించిన విషయం తెలిసిందే ఇక ఈ జంటకి ఒక పాప కూడా ఉంది. తాజాగా ప్రశాంతి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..
ఏవీఎస్ కెరియర్..
ఇకపోతే ఏవీఎస్ విషయానికి వస్తే… ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులను సైతం దక్కించుకున్నారు.. ఇక తన సినిమాల ద్వారా ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయే ఏవీఎస్.. మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమనే చెప్పాలి.. ఇక ఈయన అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. ఏవీఎస్ గా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ అందరిని తన నటనతో అబ్బుర పరిచేవారు. ఏది ఏమైనా నేడు మన మధ్య లేకపోయినా.. ఆయన మాత్రం ప్రజల గుండెల్లో శాశ్వతంగా గుడి కట్టుకున్నారని చెప్పవచ్చు.
View this post on Instagram