Kalki 2898AD first day Collections: కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్..ఆ రికార్డ్స్ బ్రేక్ చేసిందా..?

Kalki 2898AD first day Collections.. ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD.. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం మొదటి షో తోనే మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇందులో దీపికా పదుకొనే, దిశా పటానీ , మాళవిక నాయర్, మృణాల్ ఠాకూర్, శోభన తదితర హీరోయిన్స్ తో పాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ , కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ హీరోలు కూడా ఇందులో భాగమయ్యారు.. ఎవరికి వారు తమ పాత్రలకు ప్రాణం పోస్తూ సినిమాకి జీవం పోశారని చెప్పాలి. ఎక్కడ కూడా ఏ సన్నివేశంలో కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు..

మొదటి రోజే భారీ సక్సెస్..

Kalki 2898AD first day collections: Kalki first day collections..did that record break..?
Kalki 2898AD first day collections: Kalki first day collections..did that record break..?

ఒక అద్భుతమైన కథను తీసుకోవడమే కాదు కథను తెరపై ఆవిష్కరించడంలో కూడా నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యారు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా రూ .600 కోట్ల బడ్జెట్తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఆయన కూతుర్లు ఈ సినిమాను నిర్మించారు.. అయితే వీరు పెట్టిన పెట్టుబడికి పూర్తిస్థాయిలో ఫలితం లభించబోతోంది అని చెప్పాలి.. ముఖ్యంగా ఈ సినిమాలో బుజ్జి వెహికల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. దీనికోసం ప్రత్యేకంగా మహేంద్ర కంపెనీతో కలిసి రూ .4కోట్లు ఖర్చు చేసి ఈ వెహికల్ ను తయారు చేశారు.. మరొకవైపు ఈ కార్ కి నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అందించడం మరొక ప్లస్ అనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా సాహూ ప్రభాస్.. సాహోరే నాగ్ అశ్విన్ అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా మొదటి రోజు పూర్తి చేసుకుంది.. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయం హాట్ టాపిక్ గా మారింది..

రూ.213 కోట్లు వసూల్..

ఇక తాజాగా మొదటి రోజు విడుదలైన తర్వాత ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయానికి వస్తే.. తాజాగా ఇండస్ట్రీ ట్రాకర్ ప్రకారం.. భారతదేశంలోని అన్ని భాషల్లో మొదటి రోజు దాదాపు రూ.98 కోట్ల నికర ఆదాయాన్ని వసూలు చేసినట్లు సమాచారం. ఇక గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే రూ. 115 కోట్లు అంచనా వేయబడింది.. ఇక మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.213కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. ఇక తొలి రోజు ఈ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు..

- Advertisement -

3వ అతిపెద్ద ఇండియన్ ఓపెనర్ మూవీగా రికార్డ్..

ఇకపోతే ఈ వసూళ్లతో కల్కి2898AD.. కేజిఎఫ్ 2 – రూ .159 కోట్లు, సలార్ – రూ.158 కోట్లు, లియో – రూ.142.75 కోట్లు , జవాన్ – రూ .129 కోట్లు, సాహో – రూ .130 కోట్ల కలెక్షన్స్ ను దాటేసింది..అయితే ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ – రూ.223 కోట్ల కలెక్షన్స్ తో అత్యధిక భారతీయ ఓపెనర్ మూవీగా కొనసాగుతూ ఉండగా.. బాహుబలి 2 మొదటి రోజున రూ .217 కోట్లకు పైగా వసూలు చేసింది.. అయితే ఈ రెండు సినిమాల రికార్డులను ఇప్పుడు కల్కి 2898AD బ్రేక్ చేయలేక పోయింది.. ఇక దీంతో భారతీయ మూడవ అతిపెద్ద ఓపెనర్ మూవీగా నిలిచింది కల్కి 2898 AD..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు