Senior Actress Annapurna.. ప్రముఖ సీనియర్ నటీమణి అన్నపూర్ణమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒకప్పుడు ఎన్టీఆర్ , ఏఎన్నార్లతో కలిసి నటించిన ఈమె.. ఇప్పుడు వారి వారసులతో కూడా నటిస్తూ సందడి చేస్తోంది.. ముఖ్యంగా చిరంజీవిని మొదలుకొని మహేష్ బాబు, అల్లు అర్జున్ , వరుణ్ తేజ్ రామ్ చరణ్, వెంకటేష్ వంటి తదితర స్టార్ హీరోలకు అమ్మగా, బామ్మగా నటిస్తూ.. మెప్పిస్తూ నేటికీ అగ్ర తారగా కొనసాగుతోంది అన్నపూర్ణమ్మ . దాదాపు మూడు తరాల హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.. ఒక వెండితెర పైనే కాదు బుల్లితెరపై కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి కామెడీ షో లలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే ఎంతోమంది నటీమణులు తమకు జరిగిన పరిస్థితులను మీడియాతో పంచుకున్నారు.. ఇప్పుడు అన్నపూర్ణమ్మ వంతు వచ్చింది.. తాజాగా ఈమె కూడా ఒక ఇంటర్వ్యూలో తనకు జరిగిన క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.
క్యాస్టింగ్ కౌచ్ పై అన్నపూర్ణమ్మ షాకింగ్ కామెంట్స్..
“సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య నేటిది కాదు.. నాడు నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజు నుంచే ఉంది.. అప్పట్లో చాలామంది మీకు ఆఫర్ ఇస్తాము కానీ మరి మాకు ఏంటి? అని అడిగేవారు.. ఆ భయంతో నేను 20 ఏళ్లకే పెళ్లి చేసుకొని.. 25 ఏళ్లకే తల్లి పాత్రలు చేయడం మొదలుపెట్టాను ..అప్పుడు సినిమా షూటింగ్స్ లో భాగంగా ఎక్కడికెక్కడికో వెళ్లాల్సి వచ్చేది.. అప్పుడప్పుడు అక్కడే రాత్రి సమయంలో కూడా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఆ సమయంలో కొంతమంది చిల్లర వెధవలు మా రూమ్ దగ్గరికి వచ్చి తలుపు తట్టేవాళ్ళు.. అర్ధరాత్రి పూట వాళ్ళు చేసే పనులకు చాలా భయపడి పోయే వాళ్ళం.. ఎప్పుడైతే ఎయిడ్స్ అనే వ్యాధి వచ్చిందో.. అప్పటినుంచి చాలామంది పరాయి వారితో ఆ పని చేయడానికి భయపడిపోయేవారు. ఇక ఆ వ్యాధి వచ్చాక ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు దాదాపు తగ్గిపోయాయి”.. అంటూ క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్లు చేసింది అన్నపూర్ణమ్మ.
2018 తరువాతే బహిర్గతం..
ఇకపోతే సినీ ఇండస్ట్రీలో 2018లో మీటూ అనే ఉద్యమం తెరపైకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు తమ ఇబ్బందులను మీడియాతో చెప్పుకుంటున్నారు.. ఇప్పటికే రమ్యకృష్ణ మొదలుకొని యంగ్ హీరోయిన్ల వరకు చాలామంది.. ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి చెప్పుకుంటూ ఉండటం నిజంగా బాధాకరమని చెప్పాలి.. అయితే ఇలాంటి విషయాలు బయటకు వినిపిస్తూనే ఉన్నా.. ఇప్పటికీ ఇటువంటి ఇబ్బందులను ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు.. అయితే కొంతమంది వీటిని ఎదుర్కొని ధైర్యంగా ఇండస్ట్రీలో ముందుకు వెళ్తుంటే.. మరికొంతమంది ఇటువంటివి తాళలేక ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు. మరికొంతమంది అవకాశాల కోసం తమను వాడుకుంటున్నారు అంటూ చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే.. ఏది ఏమైనా ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఒక సినిమా రంగంలోనే కాదు దాదాపు అన్ని రంగాలలో కూడా మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని చెప్పవచ్చు.. ఏది ఏమైనా అన్నపూర్ణమ్మ క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.