Actress : బడా హీరోలకు కూడా దక్కని గౌరవం… పాఠ్యపుస్తకాల్లో ఈ హీరోయిన్ జీవిత కథ..!

Actress… సాధారణంగా హీరోలైనా.. హీరోయిన్లైనా సినిమాల ద్వారా తమ నటనతో ప్రేక్షకులను అలరించడమే కాదు.. అప్పుడప్పుడు వీరు చేసే సామాజిక సేవ వల్ల కూడా ప్రజల గుండెల్లో గుడి కట్టుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా వారికి జీవితంలో మరిచిపోలేని అరుదైన గౌరవాన్ని కట్టబెడుతూ ఉంటారు. అలా తాను చేసిన ఒక మంచి పనికి ఒక హీరోయిన్ కి ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది.. ఇప్పటి వరకు ఉన్న బడా హీరోలలో ఏ ఒక్కరికి దక్కని ఆ గౌరవం పునీత్ రాజ్ కుమార్ తర్వాత ఈమెకే దక్కిందని చెప్పవచ్చు.. అదే ఆమె జీవిత కథను పాఠ్యపుస్తకాలలో చేర్చడం ..మరి ఆ హీరోయిన్ ఎవరు? ఎక్కడ ఈ విషయం జరిగింది? ఎందుకు ఈమె కథను పాఠ్య పుస్తకాలలో చేర్చారు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

పాఠ్యపుస్తకాలలో తమన్నా జీవిత కథ..

Actress : An honor that even big heroes don't get... The story of this heroine's life in textbooks..!
Actress : An honor that even big heroes don’t get… The story of this heroine’s life in textbooks..!

ఆమె ఎవరో కాదు మిల్క్ బ్యూటీ తమన్నా.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 19 సంవత్సరాల కు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ అదే అందంతో అదే చలాకీతనంతో ఇండస్ట్రీలో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇక త్వరలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్న ఏడు అడుగులు వేయబోతోంది.ప్రస్తుతం తమన్న వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఈమె గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే ఇప్పటివరకు పలువురు సెలబ్రిటీల గురించి స్కూల్ పుస్తకాల్లో పాఠాలుగా చేరుస్తున్న విషయం తెలిసిందే.. అలా ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖుల గురించి కూడా పలు రాష్ట్రాలలో స్కూల్ పుస్తకాల్లో పాఠాలుగా చేర్చారు. అయితే తాజాగా తమన్నా గురించి కూడా కర్ణాటకలోని బెంగళూరులో హెబ్బల సింధీ ఉన్నత పాఠశాల ఏడవ తరగతి పుస్తకాల్లో పాఠ్యాంశాన్ని చేర్చారు.. నటి తమన్న , రణవీర్ సింగ్ ల గురించి పాఠ్యాంశాలలో చేర్చడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నా ఇది వివాదంగా మారింది..

వివాదంగా మారిన తమన్నా పాఠ్యాంశం..

దేశ విభజన తర్వాత సింధీ ప్రజల్లో ప్రముఖుల గురించి చెప్పే పాఠంలో వీరి గురించి చేర్చడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సింధీ వర్గంలో చాలా మంది కళాకారులు ఉండగా.. సినిమాల్లో నటించే తమన్న జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం ఏంటి? అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అంతే కాదు పాఠశాలకు వచ్చి గొడవ కూడా చేస్తున్నారు.. అయితే సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతోనే ఇలా చేర్చాము అని యాజమాన్యం చెబుతోంది.. కానీ దీనిపై పలువురు పిల్లల తల్లిదండ్రులు మాత్రం పోలీసులకు కంప్లైంట్ కూడా చేసినట్లు సమాచారం.. ఇక దీనిపై ఇంగ్లీష్ స్కూల్స్ అసోసియేషన్ కర్ణాటక స్పందిస్తూ.. త్వరలోనే విచారిస్తాము అని స్పష్టం చేసింది. ఇకపోతే తమన్నా జీవిత కథను పాఠ్యాంశంలో చేర్చడం ఆశ్చర్యకరం అయినప్పటికీ అభిమానులకు మాత్రం ఈ విషయం సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే తమన్న కరోనా టైం మొదలుకొని ఇప్పటివరకు చాలామంది నిరుపేదలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇక సింధీ జాతికి చెందిన తమన్నా తమ వర్గంలో అత్యంత స్థాయికి చేరడంతోనే ఈ విధంగా ఆమెను పాఠ్య పుస్తకాల్లో చేర్చినట్లు సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు