Kalki 2898AD: RRR రికార్డ్స్ బ్రేక్ చేసిన కల్కి.. ఎన్ని కోట్లంటే..?

Kalki 2898AD.. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి 2898AD మేనియా కొనసాగుతోంది అని చెప్పవచ్చు. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే హిట్ టాక్ తో దూసుకుపోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంపై విడుదలకు ముందు నుంచే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఫలితంగా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.. తెలుగు హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా గా కల్కి 2898AD నిలిచిపోయింది.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ సీనియర్ అగ్ర నిర్మాత అశ్వినీ దత్.. కూతుర్లతో కలిసి ఈ సినిమా నిర్మించారు.. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తొలిసారి తెలుగు తెరకు పరిచయమయ్యింది.. ఇందులో అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, విజయ్ దేవరకొండ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

కల్కి 2898AD థియేట్రికల్ బిజినెస్..

Kalki 2898AD: Kalki broke RRR records.. how many crores..?
Kalki 2898AD: Kalki broke RRR records.. how many crores..?

ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో రూ.65 కోట్లు, సీడెడ్ లో రూ.27 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి రూ.168 కోట్లు బిజినెస్ జరగగా.. కర్ణాటకలో రూ.25 కోట్లు, తమిళనాడులో రూ .16 కోట్లు, కేరళలో రూ.6 కోట్లు, ఓవర్సీస్ లో రూ.70 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో కలిపి రూ.85 కోట్లు.. మొత్తంగా రూ.370 కోట్ల బిజినెస్ జరిగింది. టెక్నికల్ వండర్ గా వచ్చిన ఈ సినిమాకి అన్ని ఏరియాలలో కూడా అదిరిపోయే రెస్పాండ్ లభించిందని చెప్పవచ్చు.. ఇక ఇందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సినిమాకి మొదటి రోజు అన్ని ఏరియాల్లో ఊహించని కలెక్షన్స్ సొంతం అయ్యాయి.

ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేసిన కల్కి..

మొదటి రోజే ఈ సినిమా ఒక్క రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి రూ .48 కోట్లు వసూలు చేయడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. అంతేకాదు ఈ కల్కి సినిమా నైజాం ఏరియాలో మాత్రం ఆర్ఆర్ఆర్ రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తొలి రోజు నైజాం ఏరియాలో రూ.23.55 కోట్లు వసూలు చేస్తే.. ప్రభాస్ కల్కి రూ.24 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అయితే నైజాం ఏరియాలో ఆర్ ఆర్ ఆర్ రికార్డులను కల్కి బ్రేక్ చేసింది కానీ ఓవరాల్ గా బ్రేక్ చేయలేకపోయిందని చెప్పవచ్చు.

- Advertisement -

వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

ఇక పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో కలుపుకొని మొదటి రోజు దాదాపు రూ.98 కోట్ల నికర ఆదాయాన్ని వసూలు చేయగా.. రూ.115 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని సమాచారం. ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.213 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిందని సమాచారం. ఇకపోతే తొలి రోజు ఈ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేసింది కానీ ఆర్ఆర్ఆర్ – రూ.223 కోట్లు, బాహుబలి 2 – రూ.217 కోట్లు వసూలు చేశాయి. ఇక ఏ రికార్డులను కల్కి సినిమా బ్రేక్ చేయలేకపోయింది. కానీ ఇండియాలోనే మొదటి ఓపెనర్ విషయంలో మూడవ ఇండియన్ చిత్రంగా రికార్డు సృష్టించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు