Pushpa 2 : పవన్ ఎఫెక్ట్ – అల్లు అర్జున్‌కు దెబ్బ మీద దెబ్బ… మూవీ నుంచి సుక్కు అవుట్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం నేషనల్ లెవెల్ లో ఎంతో విజయాన్ని సాధించింది. ఇక ఈ మూవీలో సాంగ్స్ ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పుష్ప ది రైజ్ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో పుష్ప టు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఫిక్స్ అయిపోయారు.

ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా ఇండిపెండెన్స్ డే రోజున రిలీజ్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. దానికి తగినట్టుగానే ఈ సినిమాను ఆగస్టు 15 రిలీజ్ డేట్ ను వాయిదా వేసి….డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడమే సినిమా రిలీజ్ వాయిదాకు గల కారణమని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇదిలా ఉండగా….పుష్ప టు సినిమా గురించి రీసెంట్ గా వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సుకుమార్ తన ఐఫోన్ ను కోపంగా విసిరేసి పగలగొట్టాడని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ వార్త ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో ఇంపార్టెంట్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో నటీనటులు ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టకపోగా….సరిగ్గా నటించలేదట. అప్పటికే ఆ సీన్ 40 టేకుల మీద తీసుకుని చేయడం జరిగిందట.

- Advertisement -

As Deputy CM, Pawan Kalyan focused on Real Pushparaj
ఒకరు మంచిగా చేస్తే ఇంకొకరు చేయకపోవడంతో చాలా కోపంతో రగిలిపోయిన సుకుమార్ ఎవరిని ఏమీ అనలేక తన చేతిలో ఉన్న ఫోన్ ను నేలకేసి కొట్టి సెట్స్ నుంచి బయటకు వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఇదే వార్త వైరల్ అవుతుండగా….పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బన్నీ మోసం చేసినందుకు ఇలాంటివి జరగాల్సిందేనని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక నటించిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు