Fahad fazil : నటుడు ఫహద్ ఫాజిల్ పై కేసు.. ఎందుకంటే..?

Fahad fazil..మలయాళ సినీ ఇండస్ట్రీలోని సినిమాలు అన్ని భాషలలో కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి.. ముఖ్యంగా తెలుగు లో డబ్బింగ్ అయ్యి కూడా బాక్సాఫీస్ వద్ద ఊచ కోత కోస్తున్నాయి. ఈ ఏడాది సుమారుగా ఐదుకు ఫైగా బ్లాక్ బాస్టర్ చిత్రాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హీరోగా, విలన్ గా తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకున్న ఈయన ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా ఈ నటుడు హీరోయిన్ నజ్రియా భర్త కావడం ఈయనకు మరింత క్రేజ్ ని తీసుకువచ్చింది. పైగా పుష్ప చిత్రంలో విలన్ గా నటించి కూడా మరింత క్రేజ్ దక్కించుకున్నారు.

చిక్కుల్లో ఇరుక్కున్న ఫహాద్ ఫాజిల్..

Fahad fazil : Case against actor Fahad Fazil.. because..?
Fahad fazil : Case against actor Fahad Fazil.. because..?

ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు ఫహద్ ఫాజిల్.. ఇవే కాకుండా రెండు , మూడు తమిళ, మలయాళం చిత్రాలలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఫహద్ ఫాజిల్ నిర్మిస్తున్న ఒక చిత్రం వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక ప్రభుత్వాసుపత్రిలో సినిమా షూటింగ్ చేయడం వల్ల మానవ హక్కుల కమీషన్ నటుడు పైన ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది.. కేరళలోని అంగమాలి తాలూకా ఆసుపత్రిలో క్యాజువాలిటీ విభాగంలో నిన్నటి రోజున రాత్రి సినిమా షూటింగ్ చిత్రీకరిస్తూ ఉండగా.. రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయనే విషయం వైరల్ గా మారుతోంది

పింక్లి సినిమా షూటింగ్ వల్లే..

ముఖ్యంగా అత్యవసర విభాగంలో సినిమా షూటింగ్ అనుమతించినందుకు.. ఏడు రోజులలో ఒక వివరణ ఇవ్వాలని.. అక్కడ వైద్యాధికారి అంతమలి తాలూకా ఆసుపత్రి సూపరిడెంట్ కు సైతం కమీషన్ సభ్యులు ఒక నోటీసును సైతం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఫహద్ ఫాజిల్ తెరకెక్కిస్తున్న పింక్లి సినిమా షూటింగ్ వల్లే చిక్కుల్లో పడ్డట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా హాస్పిటల్లో ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగులు అత్యవసర విభాగంలోకి కూడా తీసుకు వెళ్లలేని పరిస్థితి అక్కడ ఏర్పడిందట. మొత్తం మీద 50 మంది చిత్రీకరణ సమయంలో పాల్గొన్నారని.. అంతేకాకుండా మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎవరిని రాకుండా షూటింగ్ జరిపారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మలయాళ నిర్మాతల సంఘం మాత్రం ఈ ఆరోపణలను కొట్టివేసినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

నిర్మాతలు క్లారిటీ..

అయితే వారు తెలుపుతున్న సమాచారం మేరకు.. కేవలం ఒక్క రాత్రి సినిమా షూటింగ్ కోసమే పదివేల రూపాయలు అక్కడ చెల్లించామంటూ నిర్మాతలు తెలియజేస్తున్నారు.. తాము ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని నిర్మాతలు తెలియజేశారు. ఈ ఘటన సుమోటోగా స్వీకరించిన హ్యూమన్ రైట్స్ కమీషన్ ఈ కేసును నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో నిర్మాతలు విచారణలో పాల్గొనాల్సి ఉన్నట్లు సమాచారం. అలాగే ఫహద్ కూడా ఈ విచారణను ఎదుర్కోవలసి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన అటు ఫహద్ ఫాజిల్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో మెప్పిస్తూ ఉన్నారు. ప్రతి పాత్ర కూడా తన పేరుని పెంచేలాన నటిస్తూ ఉన్నారు ఫహాద్ ఫాజిల్. నటన విషయంలో భారీ క్రేజ్ దక్కించుకున్న ఇప్పుడు ఈ కేసు నుంచి ఎలా బయట పడతారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు