Tollywood Heroine: రూ. వందల కోట్ల ఆస్తి.. కానీ ఒంటరి బ్రతుకు..!

Tollywood Heroine: ప్రముఖ తెలుగు హీరోయిన్ రేఖ.. తెలుగులో కంటే బాలీవుడ్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకొని అక్కడ బాలీవుడ్ హీరోయిన్ గా మారిపోయింది.. ఇప్పటివరకు సుమారు 200 చిత్రాలకు పైగా నటించి అటు హిందీ ఇటు తెలుగు ప్రేక్షకులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఈమె కెమెరా ముందుకు వచ్చి దాదాపు పదేళ్లు అవుతోందనే చెప్పాలి.. రేఖ ప్రాపర్టీ విషయంలో ముందు జాగ్రత్త ఎక్కువ.. అందుకే మళ్ళీ వయసు తగ్గిన తర్వాత సినిమాల్లో నటిస్తానో లేదో అని అనుకున్న ఈమె జాగ్రత్త పడి.. ముందే ఆస్తులను కూడబెట్టింది..

మహానటి సావిత్రిలా కాకూడదని అలాంటి పని..

Tollywood Heroine: Rs. Hundreds of crores of property.. but a lonely life..!
Tollywood Heroine: Rs. Hundreds of crores of property.. but a lonely life..!

నిజానికి సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు సినిమాలలో అవకాశాలు వస్తున్నప్పుడు చాలా హుందాగా బ్రతికారు… కానీ అవకాశాలు తగ్గే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని..చివరికి దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు… అందుకే తాను కూడా తన పిన్ని.. మహానటి సావిత్రి లాగా కాకూడదని రేఖ అనుకుందో ఏమో దీపం ఉండగానే అన్నీ చక్కదిద్దుకుంది. ప్రస్తుతం ఆమెకు సినిమా నుంచి సంపాదన లేకపోయినా.. గతంలో కూడబెట్టుకున్న వందల కోట్ల ఆస్తులు ఆమెకు జీవనాన్ని గడిచేలా చేస్తున్నాయి.. ముఖ్యంగా ఈమె ఆస్తులకు కొదవలేదు అని చెప్పవచ్చు..

రూ. వందల కోట్లు..

ప్రస్తుతం ముంబైలో ఉంటున్న రేఖ.. తాను నివసిస్తున్న ఇంటి ఖరీదే అక్షరాలా రూ .100 కోట్లు.. అద్దెల రూపంలో ప్రతినెల లక్షల రూపాయలు వచ్చి ఈమె అకౌంట్లో చేరుతున్నాయి.. ఇక బ్యాంకులో ఈమె చేసిన పిక్స్ డిపాజిట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అంతలా డబ్బు కూడబెట్టింది రేఖ.. భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువే.. అందుకే కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా.. తన సంపాదనలో అధిక శాతం ఫిక్స్డ్ డిపాజిట్ లో దాచుకుంది.. ఇక ఎవరికీ కూడా వృధాగా డబ్బు ఇవ్వలేదు.. ఇంట్లో మంది మార్బలం కూడా లేరు.. ఒక సెక్రటరీ, డ్రైవర్ తప్ప ఇంకొకరిని పనుల కోసం తన ఇంట్లో నియమించుకోలేదు రేఖ.. పైగా వీరిద్దరూ కూడా చాలా ఏళ్లుగా ఈమె దగ్గరే పని చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇలా వందల కోట్ల ఆస్తులు కూడబెట్టి భవిష్యత్తుకు పునాదులు వేసుకున్న ఈమె తన వ్యక్తిగత జీవితానికి మాత్రం బాటలు వేసుకోలేకపోయింది.

- Advertisement -

అన్నీ వున్నా ఒంటరి జీవితం..

ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. అగ్ర నటుడు జెమినీ గణేషన్, పుష్పవల్లి దంపతులకు జన్మించిన ఈమె తన అద్భుతమైన నటనతో 2010లో పద్మశ్రీ అవార్డును కూడా సొంతం చేసుకుంది.. ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో కూడా మెప్పించింది. ఇకపోతే 1990 మార్చిలో ముఖేష్ అగర్వాల్ వివాహం చేసుకుంది రేఖ.. అయితే అతడు మానసిక సమస్యలకు లోనయి ఆ విషయాన్ని బయట చెప్పకుండా 1990 అక్టోబర్ రెండవ తేదీన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కట్టుకున్న భర్త కనీసం 10 నెలలు కూడా తనతో ఉండలేకపోయారు.. ఆయన స్వర్గస్తులయ్యారు. ఆ తర్వాత నుంచి ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగిస్తోంది .. ఒకరి పోతే ఇంకొకరు అన్నట్టు ఉన్న ఈ సమాజంలో భర్త పోయిన తర్వాత ఇంకో తోడు వెతుక్కోకుండా ఇప్పటికీ.. వందల కోట్ల ఆస్తి ఉన్న ఒంటరి జీవితం రేఖ సొంతం అయిపోయిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు