Nagarjuna: ఎఫైర్ వార్తలపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్..!

Nagarjuna: సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరో , హీరోయిన్స్, ఆర్టిస్టుల మధ్య ఎప్పటికప్పుడు రకరకాల గాసిప్స్, రూమర్స్ వైరల్ అవుతూనే ఉంటాయి.. కాస్త అమ్మాయి, అబ్బాయి చనువుగా కనిపించారంటే చాలు.. వారి మధ్య ఏదో ఉందనే ఎఫైర్ సృష్టించేస్తూ ఉంటారు పుకారు రాయుళ్లు.. ఇక నవ మన్మధుడు నాగార్జున విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రోజుల్లో చాలామంది హీరోలతో ప్రేమాయణం నడుపుతున్నారంటూ రకరకాల రూమర్లు షికార్లు కొట్టాయి. ముఖ్యంగా దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మితో నాగార్జున వైవాహిక జీవితం , విడాకుల విషయంలో కూడా ఇలా ఎన్నో రూమర్స్ వచ్చాయి ..

ఆ హీరోయిన్స్ తో నాగార్జున ఎఫైర్..

Nagarjuna: Nag gave a big twist on the affair news..!
Nagarjuna: Nag gave a big twist on the affair news..!

ఆ తర్వాత కాలంలో టబు , శ్రియ , అనుష్క శెట్టి , పూజా బాత్రా, మనీషా కొయిరాలా ఇలా చాలామంది హీరోయిన్స్ తో నాగార్జునకు సంబంధాలు అంటగట్టారు.. ఇక రోజు రోజుకు ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి కానీ ఈ విషయంపై అటు ఆ హీరోయిన్స్ కానీ ఇటు నాగార్జున కానీ ఎవరు స్పందించలేదు. దీంతో పూర్తి స్థాయిలో రూమర్స్ చెలరేగిపోయాయి. ముఖ్యంగా అనుష్కతో నాగార్జున డేటింగ్ లో ఉన్నారంటూ కూడా వార్తలు వచ్చేవి.. అయితే ఇన్ని రోజుల తర్వాత నాగార్జున తొలిసారి స్పందించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఎఫైర్ రూమర్స్ పై ఆవేదనతో పాటు అసహనం..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జునకు.. చాలామంది హీరోయిన్స్ తో ఎఫైర్ రూమర్స్ గురించి ప్రశ్న ఎదురయింది.. ఇంటర్వ్యూలో భాగంగా మీకు హీరోయిన్లతో ఉన్న ఎఫైర్ ఏంటి..? అసలు విషయం చెప్పమని యాంకర్ అడగగా.. నాగార్జున మాట్లాడుతూ. స్వతహాగా నేను చాలా పొడుగ్గా ఉంటాను.. నా పక్కన పొట్టిగా ఉండే అమ్మాయిలకంటే హైట్ గా ఉండే వాళ్లే బాగుంటారు. అందుకే నా సినిమాలలో దర్శక నిర్మాతలకు కూడా పొడుగ్గా ఉండే హీరోయిన్లను తీసుకోమని సలహా ఇస్తూ ఉంటాను.. ఈ క్రమంలో చాలామంది హీరోయిన్లను నా పక్కన రిపీట్ గా పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. అలాంటి హీరోయిన్స్ లో ప్రథమంగా వినిపించే పేరు అనుష్క శెట్టి.. ఇక మా ఇద్దరి కెమిస్ట్రీ కూడా సినిమాలలో చాలా బాగా కుదిరింది. అందుకే చాలా సినిమాలలో మేమిద్దరం కలిసి నటించాము అయితే ఇలాంటి సమయంలో అనుష్కకు – నాకు మధ్య లేనిపోనివి అంటగట్టారు…

- Advertisement -

నాతోనే కాదు చైతూతో కూడా ఎఫైర్..

నాతోనే కాదు నా కొడుకు నాగచైతన్య కి కూడా అనుష్కతో ఎఫైర్ ఉందని రూమర్లు సృష్టించడం చాలా బాధగా ఉంది అంటూ ఎమోషనల్ అవుతూనే ఆగ్రహం వ్యక్తం చేశారు నాగార్జున.. నాగచైతన్య కంటే అనుష్క వయసులో చాలా పెద్దవారు.. దీనికి తోడు అతడి కంటే హైట్ కూడా ఆమె ఎక్కువే.. మరి ఎలా సెట్ అవుతుందని ఇలాంటి రాతలు రాస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు నాగార్జున.. ఇకపోతే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న నాగార్జున ఇన్ని రోజుల తర్వాత ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి అందరి నోర్లు మూయించారు. ఇకపోతే గతంలో నాగచైతన్యకు యోగ టీచర్ గా అనుష్క వ్యవహరిస్తోందని.. సమంత కు విడాకుల తర్వాత నాగచైతన్య , అనుష్క వివాహం చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే. దీంతో నాగార్జున స్పందించి ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు