GoodBadUgly : థలా సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఆ హాలీవుడ్ సినిమాకి కాపీయా?

GoodBadUgly : కోలీవుడ్ స్టార్ థలా అజిత్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లలో తెగ బిజీ అవుతున్నాడు. అందులో ఒకటి “విదా ముయార్చి” కాగా, మరొకటి “గుడ్ బ్యాడ్ అగ్లీ”. ఇక ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోయే ఈ సినిమా కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ ని తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక లాస్ట్ ఇయర్ తమిళ్ లో ‘మార్క్ ఆంటోని’ సినిమాతో బ్లాక్ బస్టర్ తీసాక రవిచంద్రన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఆ మధ్య గుడ్ బ్యాడ్ అగ్లీ (GoodBadUgly) కోసం హైదరాబాద్‌ లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌ని నిర్మించగా, అందులో ఓ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్‌ ని తీయడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో వైరల్ అవుతుంది.

GoodBadUgly movie remake of Korean movie?

థలా సినిమా ఆ హాలీవుడ్ మూవీ కి రీమేకా?

అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై తాజాగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ ఓ హాలీవుడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్నట్టు ప్రచారం నడుస్తుంది. ఈ మూవీ ఓ కొరియన్ మూవీ అయిన “ది గ్యాంగ్ స్టర్ ది కాప్ ది డెవిల్” అనే మూవీకి రీమేక్ గా తెరకెక్కుతుందని వార్తలు వస్తున్నాయి. 2019లో వచ్చిన ఆ సినిమా కొరియన్ భాషలో మంచి సక్సెస్ అయింది. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ వచ్చినప్పటి నుండి వస్తున్న అప్డేట్స్ ఆ సినిమానే పోలి ఉన్నాయని కోలీవుడ్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ టైటిల్ కి తగ్గట్టుగానే అజిత్ కి సంబంధించి లేటెస్ట్ గా మూడు షేడ్స్ తో సెకండ్ లుక్ పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ చేసారు. అప్పటి నుండి ఈ సినిమా ఆ కొరియన్ మూవీకి కాపీ అంటూ వైరల్ అవుతుంది. మరి ఆ సినిమాకే రీమేక్ గా చేస్తున్నారా, లేదా కొత్త స్టోరీయా అనే విషయంపై మేకర్స్ నుండే క్లారిటీ వస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

సంక్రాంతికి తీసుకువచ్చే ప్లాన్ లో మేకర్స్..

ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటూ ఉంది. అజిత్ నటిస్తున్న విదా ముయార్చి సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ఆగష్టు కల్లా ఆ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని టాక్. ఇక ఆ సినిమా పూర్తి కాగానే గుడ్ బ్యాడ్ అగ్లీ పై పూర్తి ఫోకస్ పెట్టనున్నాడు అజిత్. అయితే సినిమా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఓ గ్యాంబ్లింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తునట్టు సమాచారం. సునీల్ కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తునట్టు టాక్.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు