Indian 2 Release Date : కమల్ హాసన్ ఎన్ని సినిమాలు చేస్తున్నా… ఇండియన్ 2 సినిమాపై ఫ్యాన్స్‌కు ఇంట్రెస్ట్ వేరే లెవెల్. దాదాపు 28 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. అలాగే ఇటీవల వచ్చిన ట్రైలర్ సినిమాపై బజ్ పెంచింది. అయితే రిలీజ్ కి ముందు సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. సినిమాను నిలిపివేయాలి అంటూ కోర్టు మెట్లు ఎక్కారు. అసలు ఏం జరిగింది అంటే…
భారతీయుడు సినిమాలో కమల్ హసన్ చేసిన యాక్షన్ సీన్స్ చాలా హైలైట్. ఆయన వర్మక్కలైతో చేసే ఫైట్ సీన్స్ అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. మంచి పేరు కూడా వచ్చింది. దీని కోసం కమల్ హాసన్ 1996 లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. రాజేంద్రన్ అనే వ్యక్తి దగ్గర కమల్ హాసన్ ఈ వర్మక్కలై విధ్య ను నేర్చుకున్నాడు. ఆ సమయంలో వర్మక్కలై కు సంబంధించిన టెక్నిక్ లను కమల్ హసన్, శంకర్ కు చెప్పారట. అంతే కాదు, భారతీయుడు టైంలో టైటిల్ కార్డులో రాజేంద్రన్ కు క్రెడిట్ కూడా ఇచ్చారట.
అయితే ఇప్పుడు భారతీయుడు 2 లో వర్మక్కలై వాడుతున్నట్టు తనకు సమాచారం ఇవ్వలేదట. దీంతో రాజేంద్రన్ కోర్ట మెట్లు ఎక్కాడు. వర్మక్కలై కు సంబంధించిన పూర్తి హక్కులు తన దగ్గర ఉన్నాయని, తనకు సమచారం ఇవ్వకుండా, తనకు క్రెడిట్ ఇవ్వకుండా వర్మక్కలై ను వాడుకున్నారు అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన అనుమతి లేకుండా వర్మక్కలై వాడుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
కాగా, మధురై జిల్లా న్యాయస్థానం రాజేంద్రన్ కేసును స్వీకరించి, ఇండియన్ 2 నిర్మాతలకు, డైరెక్టర్ శంకర్ కు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన విచారణ జూలై 9 జరగనుంది. కాగా, ఈ సినిమా జూలై 12న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.