Suchi Leaks: త్రిషకు కావాల్సింది అదే.. విజయ్, త్రిష ల ఎఫైర్ గురించి బయటపెట్టిన సుచిత్ర…

Suchi Leaks : కొలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం త్రిష, విజయ్ దళపతి ల మధ్య ఎఫైర్ నడుస్తుంది అనే వార్త హాట్ టాపిక్ అవుతుంది.. గతంలో వీరిద్దరి మధ్య సంబంధం ఉందంటూ వార్తలు గుప్పుమన్నాయి.. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్బంగా త్రిష చెప్పిన విషెస్ తో వీరిద్దరి మధ్య సంబంధం ఉందనే వార్తలు నిజం అయ్యాయి.. అప్పటి నుంచి వీరి గురించి నెట్టింట రోజుకో వార్త వినిపిస్తుంది.. ఈ విషయం పై కొలీవుడ్ సిగరెట్ సుచిత్ర సంచలన విషయాలను బయట పెట్టింది.. ప్రస్తుతం ఈ విషయం పై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..

వీరిద్దరి పరిచయం సినిమాలతో మొదలైంది.. ఆ తర్వాత రిలేషన్ మొదలైందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఈ మధ్య మాత్రం ఇద్దరు కలిసి ట్రిప్ లకు వెళ్తున్నారని తెలుస్తుంది.. తాజాగా సింగర్ సుచిత్ర వీరిద్దరి యవ్వారం పై సంచలన వ్యాఖ్యలు చేసింది.. విజయ్ ఆయన భార్య సంగీత తిరిగి ఎప్పుడో కలవాలి. అహంభావంతో చిన్నపాటి గొడవలతో వారి కుటుంబం చితికిపోయింది. ఇలాంటి సమయంలో త్రిష లాంటి పరాన్నజీవులు వారి మధ్యలోకి వచ్చేశాయి. లిఫ్ట్‌లో సీక్రెట్‌గా తీసిన ఫోటోను ఆమె పోస్ట్ చేసినప్పటి నుంచి వారి గురించి చర్చ నడుస్తున్నాయి. త్రిషకు కావాల్సింది కూడా ఇదే. విజయ్‌కు ఆమె దగ్గరగా ఉండాలని చూస్తుంది.

- Advertisement -

ఇక వీరిద్దరిని జయలలిత, ఎం. జీ. ఆర్ లతో పోలుస్తున్నారని ఆమె అన్నారు.. ఎంజీఆర్ మరణానంతరం జయలలిత రాజకీయాల్లో మాత్రం బాగానే చేశారు. ప్రజలకు మంచి పాలనే అందించారు. రాజకీయంగా తమిళనాటలో ఎన్నటికీ చెరిగిపోని ముద్ర ఆమె వేశారు. అయితే, ఇప్పుడు అలాగే విజయ్‌ను త్రిష ఫాలో కావాల్సిన అవసరం లేదు.. విజయ్ ఇప్పుడు త్రిష తో సంబంధం ఉండటం వల్ల రాజకీయాల్లో ఎలాగో రాణించలేడు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఈ వార్తలు విన్న విజయ్ ఫ్యాన్స్ మాత్రం సుచి పై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. చనిపోయిన వాళ్లను కూడా వదలవా అంటూ మండి పడుతున్నారు.. విజయ్ ను రాజకీయంగా ఎదగనివ్వకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. దీనిపై సుచి ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు