Rajinikanth: రజనీకాంత్ కి అల్లుడు కానున్న జయం రవి.. ఆ స్టార్ షాకింగ్ కామెంట్స్..!

Rajinikanth: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కంటే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. స్టార్ సెలబ్రిటీల విడాకులు, వివాహాల వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో.. ప్రముఖ హీరో జయం రవి విడాకుల వార్త నడుస్తుండగానే మరో బాంబు లాంటి వార్త వినిపిస్తోంది. అదేమిటంటే జయం రవి సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురితో వివాహానికి సిద్ధమయ్యారు.. అంటూ మరో వార్త తెరపైకి వచ్చింది.. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉండడం గమనార్హం.

జయం రవి విడాకులు.. క్లారిటీ ఇచ్చిన ఆర్తి..

Rajinikanth: Rajinikanth's son-in-law Jayam Ravi.. The star's shocking comments..!
Rajinikanth: Rajinikanth’s son-in-law Jayam Ravi.. The star’s shocking comments..!

ఇకపోతే తమిళ చిత్ర సినిమాలో అగ్ర నటుడుగా కొనసాగుతున్న జయం రవి.. 2009లో ప్రముఖ నిర్మాత సుజాత కుమార్తె ఆర్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా.. జయం రవి , ఆర్తి విడాకులు తీసుకుంటున్నారు అనే ప్రచారం జోరుగా సాగింది.. విడాకులకు కూడా రకరకాల కారణాలు వినిపించాయి.. అయితే ఈ వార్తలు వినిపించడంతో తాజాగా జయం రవి భార్య ఆర్తి కూడా జయం రవి నటించిన సినిమా పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేమ ఎప్పటికీ ఆగిపోదు అని.. తన భర్తతో కలిసి ఉన్న ఫోటోని కూడా షేర్ చేసి విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టింది.. అయినా సరే ఇప్పుడు మరొక వార్త తెరపైకి వచ్చింది.

రజినీకాంత్ కూతురితో జయం రవి పెళ్లి..

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది.. అదేమిటంటే జయం రవి.. ఆర్తిని వివాహం చేసుకోకుంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతుర్ని పెళ్లి చేసుకునేవాడు అని ప్రముఖ జర్నలిస్ట్ సబితా జోసెఫ్ ఒక కొత్త బాంబు పేల్చారు.. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. జయం రవి, ఆర్తి ప్రేమకు కారణం నటి కుష్బూ.. జయం రవి.. రజనీకాంత్ కూతురు పెళ్లి చేయాలని అప్పట్లో ప్రయత్నించారు.. ఈ విషయంపై చర్చలు కూడా జరిగాయి.. కానీ జయం రవి ఆర్తి తో ప్రేమలో ఉండడంతో.. సుజాత వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని తొందర పడింది.. ఎందుకంటే జయం రవి లాంటి మంచి వ్యక్తి.. అందంగా ఉన్న స్టార్ నటుడు తన కూతురికి దొరుకుతాడో లేదో అని ఆలోచించిన ఆమె .. ఆర్తి, జయం రవి ప్రేమించుకున్నారు అని తెలిసిన వెంటనే పెళ్లి చేసేసింది అంటూ సబితా జోసెఫ్ వెల్లడించారు.. ప్రస్తుతం ఈ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

ఐశ్వర్య రజనీకాంత్ పెళ్ళి, విడాకులు..

ఇక రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ విషయానికి వస్తే.. ధనుష్ ను వివాహం చేసుకున్న తర్వాత దాదాపు 19 సంవత్సరాల వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకొని.. అందరిని ఆశ్చర్యపరిచారు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ వార్త మళ్ళీ తెరపైకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 

 

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు