Thalapathy 69.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలతో తమిళ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న ఈయన.. తన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేస్తూ .. అంతకుమించి క్రేజ్ దక్కించుకున్నారని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఈయన సినిమాలు వస్తున్నాయంటే.. అటు తమిళ్, ఇటు తెలుగు ఆడియన్స్ థియేటర్ల వద్ద భారీ తిరుగుతూ ఉంటారు. తెలుగులో కూడా ఈయనకు ప్రత్యేక అభిమాన సంఘాలు ఉన్నాయి.. అంతలా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు విజయ్ దళపతి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈయన రాజకీయాలలో కి ప్రవేశించి… కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో 2029 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఇక సినిమాలు చేయరని అందరూ అనుకున్నారు… కానీ తాజాగా తన 69వ సినిమాను త్వరలోనే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దళపతి 69 వర్కింగ్ టైటిల్ తో త్వరలో ప్రారంభం..
దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని ప్రారంభించబోతున్నట్లు సమాచారం.. పైగా ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా మరొకసారి విజయ్ దళపతితో జోడి కట్టనుంది. ప్రముఖ డైరెక్టర్ హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండగా… ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నట్లు సమాచారం.. అంతేకాదు ప్రముఖ కోలీవుడ్ ప్రొడక్షన్ బ్యానర్ అయిన కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికైతే వీరంతా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జోడీ రిపీట్
ఇదిలా ఉండగా సమంత – విజయ్ దళపతి ఇదివరకే థేరీ , మెర్సల్, కత్తి వంటి చిత్రాలలో జోడీగా నటించారు. ఇకపోతే విజయ్ దళపతి 67వ చిత్రం లియో సినిమాలో కూడా సమంతను హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారు కానీ సమంత శివా నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషీ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఈ చిత్రంలో ఆమె నటించలేకపోయింది. ఇక ఈ సినిమాలో సమంత స్థానంలో త్రిష నటించి.. మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక అలా ఆ సినిమా మిస్ అవ్వడంతో ఇప్పుడు విజయ్ దళపతి 69వ చిత్రంలో కూడా సమంత నటిస్తున్నట్లు సమాచారం.. ఇక ఇదే ఫైనల్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
విజయ్ దళపతి సినిమాలు..
చివరిగా లియో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దళపతి ఇప్పుడు.. వెంకట ప్రభు దర్శకత్వంలో.. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న గోట్ సినిమాలో నటిస్తున్నారు.. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరాం, స్నేహ, అజ్మల్ అమీర్, లైలా, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగిబాబు, ప్రేమ్జీ అమరన్, యుగేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం.. ఇకపోతే రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.