Allu Arjun : డిప్యూటీ సీఎంతో మళ్లీ ఢీ అంటే ఢీ… ఈ సారి బన్నీదే పై చేయి..

Allu Arjun : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు.. ఆయన గతంలో అనౌన్స్ చేసిన సినిమాలు అన్ని ఇప్పుడు అటకెక్కాయి.. ఎన్నికల ముందు ఏదొక అప్డేట్ వచ్చిన సంగతి తెలిసిందే.. కానీ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాలకు డేట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం తన చేతిలో ఉన్న మూడు సినిమాలు అయినా చెయ్యాలని అభిమానులు ఆశ పడుతున్నారు.. ఇక సినిమాల్లో చూడలేమా అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది..

గతంలో హరిహర వీరమల్లు నిర్మాత రత్నం ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.. ఆ సందర్బంగా సినిమా ఎప్పుడొస్తుంది అనేది దానిపై ఒక హింట్ ఇచ్చాడు.. ఆయన మాట్లాడుతూ.. పవన్ మూడు వారాలు డేట్స్ ఇస్తే డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పారు.. అయితే ఆగస్టు నుంచి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ కి వాయిదా పడింది. డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ చేస్తామని ప్రకటించారు.. అదే విధంగా ఈ సినిమాను కూడా డిసెంబర్ లో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు..

Hariharaveeramallu is going to compete with Pushpa 2
Hariharaveeramallu is going to compete with Pushpa 2

ఈ వార్త గనుక నిజమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పుష్ప రాజ్ మరోసారి ఢీ కొట్టబోతున్నారని తెలుస్తుంది.. ఇప్పటికి ఎన్నికల విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది.. ఇప్పుడు సినిమాల మధ్య పోటి అంటే ఆలోచించాల్సిన విషయమే అంటూ ఇద్దరి ఫ్యాన్స్ భావిస్తున్నారు.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం.. నిజానికి పవన్ సినిమాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి.. వీరమల్లు సినిమాకు చివరి షెడ్యూల్ షూటింగ్ పెండింగ్ ఉంది.. ఇప్పటికే డిజిటల్ హక్కులను భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు