Actress Sunaina.. ప్రముఖ కోలీవుడ్ నటి సునయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తెలుగు, తమిళ్ , మలయాళం సినిమాలలో వరుసగా అవకాశాలు అందుకుంటూ.. భారీ విజయాలను సొంతం చేసుకున్న ఈమె.. ఇటీవలే వివాహం చేసుకోబోతోంది అంటూ ఈమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే తాజాగా సునయన ప్రముఖ దుబాయ్ యూట్యూబర్ ఖలీద్ అల్ అమెరీ తో నిశ్చితార్థం కూడా చేసుకుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది..
పెళ్ళి పీటలెక్కనున్న సునయన..
![Actress Sunaina: Heroine's wedding with Dubai YouTuber... If you know about his background, you have to be amazed](https://www.telugu.filmify.in/wp-content/uploads/2024/07/Untitled-2024-07-01T175305.041.jpeg)
అసలు విషయంలోకి వెళ్తే.. దుబాయ్ కి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఖలీద్ అల్ అమెరీ సోమవారం అంటే ఈ రోజు తమిళ నటి తో నిశ్చితార్థం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. జూన్ 5వ తేదీన ప్రముఖ నటి సునయన రెండు చేతులు ఒకరికొకరు పట్టుకున్నట్లు ఉండే ఎమోజిని షేర్ చేసింది.. అంటే ఆమె జీవితాంతం అతడి చెయ్యి పట్టుకోబోతున్నట్లు స్పష్టం చేసింది… ఇకపోతే ఆ ఫోటోని షేర్ చేసి నిశ్చితార్థం అయ్యిందని వెల్లడించింది కానీ తనకు కాబోయే భర్త ఎవరు అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ పోస్టును జూన్ 5వ తేదీన ఖలీద్ అల్ అమెరీ లైక్ చేశారు.. మరొకవైపు జూన్ 26వ తేదీన.. ఖలీద్ అల్ అమెరీ.. డైమండ్ రింగ్ తొడిగిన అమ్మాయి చేయి పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు.. కాబట్టి వీరిద్దరి వివాహం చేసుకోబోతున్నారని ఇప్పుడు అధికారికంగా స్పష్టమయ్యింది.. ఇక ఈ విషయం తెలిసి పలువురు సెలబ్రిటీలు , అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ప్రముఖ నటి సునయన ఇలా దుబాయ్ కి చెందిన యూట్యూబర్ ను వివాహం చేసుకోబోతోంది అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
అప్పుడే.. ఖలీద్ – సునయన ల పెళ్లి జరిగిందా..?
అయితే మరోవైపు వీరిద్దరూ ఈ ఏడాది వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించినా.. కొద్ది రోజుల క్రితమే వీరిద్దరి వివాహం అయినట్లు మరో వార్త తెరపైకి వచ్చింది.. కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అనే వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం గమనార్హం.. ఇకపోతే గతవారం ఖలీద్ తన ఇంస్టాగ్రామ్ పేజీలో నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటో ని షేర్ చేసుకున్నారు.. దీంతో అతడిని వివాహం చేసుకోబోయే అమ్మాయి గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.. ఈ క్రమంలోనే ఈయన తన పెళ్లి ఏర్పాట్లు కోసం దుబాయ్ నుంచి ఇండియా వచ్చినట్లు వెళ్లడైంది.అతడు పెళ్లి చేసుకోబోయే ఆమె సునయన అని సినీ ఇండస్ట్రీలో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ఖలీద్ అల్ అమెరీ..
ఇక దుబాయ్ కి చెందిన ఖలీద్ అల్ అమెరి విషయానికి వస్తే తన పేరుతోనే ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. వినోదాత్మక వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు ఏకంగా మూడు మిలియన్ల మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు.. ఇటీవలే నటుడు మమ్ముట్టితో చేసిన ఇంటర్వ్యూ ఈ ఛానల్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకుంది.
View this post on Instagram
Actress Sunaina and Popular Dubai Youtuber Khalid Al Ameri are reportedly engaged and expected to get married this year. pic.twitter.com/2BzHUDQ4dj
— LetsCinema (@letscinema) July 1, 2024