Varalaxmi – Nicholai Sachdev: కొలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పేరు అందరికీ తెలిసిందే.. పలు తెలుగు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం పెళ్లి పీటలెక్కబోతుంది.. వరలక్ష్మి ప్రేమించిన వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకోబోతుంది.. ఇప్పటికే ఆమె ఇంట పెళ్లిసందడి మొదలైంది..
వరలక్ష్మి శరత్‌కుమార్, నికోలాయ్ సచ్దేవ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జూన్ 30న ఓ హోటల్లో మెహందీ వేడుకతో ప్రారంభమయ్యాయి.. ఈ వేడుక కుటుంబ సభ్యులతో సందడిగా సాగింది..
ఈ వేడుకకు సంబందించిన ప్రతి ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది..
వరలక్ష్మి శరత్ కుమార్ తన పియాన్సీ తో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి..
ఈమె తన పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించింది.. ఇప్పటికే చాలా మంది సినీ తారలు ఈ వేడుకల్లో భాగం కానున్నట్లు సమాచారం..
ప్రస్తుతం మెహందీ వేడుకలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో వరలక్ష్మి ఎంతగా అందంగా ఉందో ఓ లుక్ వెయ్యండి..