Sirish Baradwaj : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ గురించి అందరికి తెలిసిందే.. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి మీడియా సమక్షంలో ఒక్కటయ్యారు. అయితే వీరి పెళ్లి బంధం మూడునాళ్ళ ముచ్చటే అయ్యింది. మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. అయితే వీరికి ఒకపాప కూడా పుట్టింది. శిరీష్ , శ్రీజలు ఇద్దరు వేర్వేరు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఇక ఇటీవల శిరీష్ అనారోగ్య సమస్యల కారణంగా ప్రాణాలను విడిచిచారు..
ఈ వార్త మరువక ముందే ఇప్పుడు మరో నిజం వెలుగు చూసింది. శిరీష్ అనారోగ్య సమస్యల గురించి శ్రీజకు ముందే తెలుసట.. అయితే ఆ విషయాన్ని విడిపోయిన తర్వాత శిరీష్ ఆమెకు చెప్పినట్లు తెలుస్తుంది. కానీ శ్రీజ మాత్రం రెస్పాండ్ అవ్వలేదని టాక్. కాగా, శిరీష్ మరణించడానికి ముందే శ్రీజకు ఫోన్ చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో ఆలస్యంగా చర్చనీయాంశంగా మారింది. అతనికి ఆరోగ్యం బాగవ్వడం కోసం ఏదైన హెల్ప్ చెయ్యమని ప్రాధేయపడినట్లు సమాచారం. కానీ శ్రీజ మాత్రం ఏ మాత్రం కనికరం కూడా లేకుండా పట్టించుకోలేదని టాక్ వినిపిస్తుంది..
శ్రీజ కాస్త పట్టించుకోని హెల్ప్ చేసినా అతను బ్రతికి ఉండేవాడని కొందరు మెగా యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. నీతులు చెప్పడం కాదు .. కూతురికి మంచి మర్యాదలు కూడా చిరంజీవి నేర్పించలేదని ఆడేకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట దుమారం రేపుతోంది. మరి దీనిపై శ్రీజ లేదా చిరంజీవి స్పందిస్తారేమో చూడాలి.. ఇక శ్రీజ , శిరీష్ లు 2007 లో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. 2014 లో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. 2016లో కళ్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అతనికి దూరంగా ఉంటుంది.. ప్రస్తుతం శ్రీజ ఇద్దరు పిల్లలు ఆమె దగ్గరే ఉన్నారు..