Jr NTR : వారసుడి ఎంట్రీపై తారక్ మౌనం… బాలయ్య మీద కోపం మోక్షజ్ఞకు శాపమా…?

Jr NTR : నందమూరి కాంపౌండ్ నుంచి మరో వారసుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి.. నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా బాలయ్య బాబు వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఖాయమైనట్లే.. తాజాగా మోక్షజ్ఞ న్యూ లుక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి హీరోలు సైతం వెయిట్ చేస్తున్నారు.. కానీ ఎన్టీఆర్ మాత్రం మౌనంగా ఉన్నాడన్న వార్త ఒకటి వినిపిస్తుంది.. అయితే తమ్ముడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నా వార్త పై ఎన్టీఆర్ ఎక్కడా స్పందించలేదు.. దీనిపై నందమూరి ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు..

Jr NTR's silence on Mokshajna's movie entry.. Is Balakrishna the reason?

నందమూరి కుటుంబంలో బాలయ్య, ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో వారిద్దరిలా డైలాగులు ఏ హీరో చెప్పలేదు.. అందులో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి.. చిన్న వయసు నుంచే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టిన ఎన్టీఆర్.. RRR చిత్రంతో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని నందమూరి పేరుని గ్లోబల్ స్థాయిలో వినిపించేలా చేశాడు.. నందమూరి పేరును ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేసినా కూడా బాలయ్య స్పందించలేదు.

- Advertisement -

నిజానికి బాలయ్య ఎన్టీఆర్ ను మొదటి నుంచి దూరం పెడుతున్న సంగతి తెలిసిందే.. ఇక ఎన్టీఆర్ కూడా బాబాయ్ తో కలిసి ఎక్కడా కనిపించలేదు.. బాలయ్య అంటే ఎన్టీఆర్ కు కోపం ఉందని అందుకే ఎక్కడా బాబాయ్ ఊసు ఎత్తడని టాక్.. అదే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీకి శాపంగా మారిందని ఓ వార్త షికారు చేస్తుంది.. తమ్ముడు ఎంట్రీ గురించి ఎక్కడా ప్రస్థావించిన దాఖలు లేవు.. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయిన తర్వాత అన్నా ఎన్టీఆర్ మౌనం వీడతాడా? లేక బాబాయ్ మీద కోపాన్ని తమ్ముడు మీద చూపిస్తాడా? అనేది చూడాలి.. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. అలాగే బాలీవుడ్ వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా రాబోతుంది.. త్వరలోనే ఈ సినిమా ప్రకటన రాబోతుందని సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు