Sri Sathya: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే నటన మాత్రమే వస్తే సరిపోదు. అందం కూడా చాలా ముఖ్యం. అందం కోసం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది అమ్మాయిలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే చాలామంది సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ముక్కు లేదా పెదవికి సంబంధించిన ఏదో ఒక సర్జరీ ముఖానికి చేయించుకుని మరింత అందంగా తయారవ్వాలని అనుకుంటూ ఉంటారు. కానీ అందులో కొంతమంది మాత్రమే అందంగా అవుతారు.
మరి కొంతమంది ఆ సర్జరీ ఫెయిల్ అయ్యి మరింత అసహ్యంగా కనిపిస్తారు. సర్జరీ చేయించుకొని మరింత వికారంగా తయారైన బ్యూటీలలో శ్రీ సత్య ఒకరు. శ్రీ సత్య గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగు అమ్మాయిగా శ్రీ సత్య మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా పలు రకాల బ్రాండ్లకు పనిచేయడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకానొక సమయంలో మిస్ ఆంధ్రగా విజయాన్ని అందుకుంది దీంతో ఈ బ్యూటీకి ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో నేను శైలజ సినిమాలో హీరో రామ్ పోతినేనికి లవర్ పాత్రలో నటించింది.
ఆ తర్వాత లవ్ స్కెచ్, గోదావరి నవ్వింది వంటి చాలా మూవీలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత ముద్దమందారం సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి విపరీతమైన క్రేజ్ ని తెచ్చుకుంది. ఇక ఈ బ్యూటీని బిగ్ బాస్ షో ద్వారా ప్రతి ఒక్కరూ శ్రీ సత్యను ఆదరించారు. ఆ తర్వాత శ్రీసత్య ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఈ బ్యూటీ ప్రస్తుతం పలు షోలు, వెబ్ సిరీస్ లు, సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
ఇక ఇటీవలే ఈ బ్యూటీ తన పెదవికి సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి గల కారణం తాను ఒకానొక సమయంలో చేసిన వీడియోలు, ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న వీడియోలను చూస్తుంటే తన పెదవికి సర్జరీ చేయించుకున్నట్టు చాలా ఈజీగా అర్థమవుతుంది. దీంతో శ్రీ సత్యను అలా చూసిన చాలామంది అభిమానులు మీరు సర్జరీ చేయించుకుంటే చాలా అసహ్యంగా ఉన్నావు. అంతకుముందే నువ్వు చాలా అందంగా ఉండే దానివి అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.