Varalakshmi Sarath Kumar: పెళ్లి వేడుకల్లో మాస్ స్టెప్పులతో ఇరగదీసిన రాధిక..!

Varalakshmi Sarath Kumar.. క్రాక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు లేడీ విలన్ గా పరిచయమైన వరలక్ష్మి శరత్ కుమార్.. ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోల సినిమాలలో వరుసగా నటిస్తూ అందరికీ లక్కీ లేడీ గా మారిపోయింది. ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఒక సినిమాలో నటిస్తోంది అంటే ఆ సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అందుకే వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా మారిపోయింది. ఇటీవలే హనుమాన్ సినిమాతో మరింత క్రేజ్ దక్కించుకున్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.

పెళ్లికి సిద్ధమైన వరలక్ష్మి శరత్ కుమార్..

Varalakshmi Sarath Kumar: Radhika rocked with mass steps in the wedding ceremony..!
Varalakshmi Sarath Kumar: Radhika rocked with mass steps in the wedding ceremony..!

మరొకవైపు వ్యక్తిగత జీవితాన్ని కూడా మరో అడుగు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది వరలక్ష్మి శరత్ కుమార్ అందులో భాగంగానే తాజాగా ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈమె ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలయ్ సచ్ దేవ్ తో కలసి ఏడడుగులు వేయబోతోంది. అయితే ఇతడికి ఇప్పటికే వివాహం జరిగి వరలక్ష్మీ శరత్ కుమార్ అంతా వయసున్న అమ్మాయి ఉన్నారు అలాంటి వ్యక్తితో ఈమె వివాహానికి సిద్ధం అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు ముసలోడే దొరికాడా ఇంకెవరూ లేరా అంటూ విమర్శించారు కూడా .. అయితే అవన్నింటిని పట్టించుకోని వరలక్ష్మి శరత్ కుమార్ అతనితో నిశ్చితార్థాన్ని కూడా జరుపుకుంది. ఇక ఇప్పుడు అతనితో కలిసి ఏడడుగులు వేయబోతోంది ఈ ముద్దుగుమ్మ.

మాస్ స్టెప్ లతో ఇరగదీసిన రాధిక శరత్ కుమార్..

జూలై 2 అనగా ఈరోజు వివాహ వేడుక జరగనుంది.. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఇక వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ మెహందీ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ఈమె తండ్రి శరత్ కుమార్ తో పాటు స్టెప్ మదర్ ప్రముఖ హీరోయిన్ రాధిక కూడా డాన్సులు వేస్తూ సందడి చేశారు. ముఖ్యంగా మెహందీ వేదిక వద్ద అతిధులతో కలిసి ఈ జంట డాన్స్ చేస్తూ అలరించారు.. విజయ్ దళపతి సూపర్ హిట్ పాటైన అపడి పోడి పాటకు మాస్ స్టెప్పులతో ఇరగదీసారని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. కూతురు వేడుకల్లో రాధిక డాన్స్ స్టెప్పులకి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు.

- Advertisement -

రాధిక – శరత్ ల జోడీ ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూనే రాధికా శరత్ కుమార్ జోడి కి కూడా హాట్సాఫ్ చెబుతున్నారు ఈ వయసులో కూడా మా స్టెప్పులతో ఇరగదీయ్యడం నిజంగా అద్భుతం అని.. ఇప్పుడు కూడా రాధిక శరత్ కుమార్ సినిమా తీస్తే హీరో హీరోయిన్లుగా బాగా సెట్ అవుతుందంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అయినా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు