Telugu Movies : ఇటీవల కాలంలో సినీ స్టార్స్ ను నమ్మిన్నంతగా వేరేవారిని జనాలు నమ్మడం లేదు.. అందుకే కొందరు స్టార్ సైతం ముందుకు వస్తూ సమాజ వ్యతిరేకంగా జరిగే వాటిని అడ్డుకోవాలని అభిమానులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు అనేక విధాలుగా మెసేజ్ లు ఇచ్చారు.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ నిర్మూలన గురించి ఓ వీడియో చేసిన సంగతి తెలిసిందే.. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎంతగా వైరల్ అయ్యిందో మనం చూసాము.. తాజాగా ఈ వీడియో పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు..
చిరంజీవి వీడియో పై రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.. ఇలాంటి పనులు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు చేస్తే బాగుంటుందని చెప్పాడు.. అంతే కాదు ఈ సందర్బంగా సినీ పరిశ్రమకు ఒక కండిషన్ కూడా పెడుతూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.. సినిమా టికెట్లు పెంచాలని ఎవరైనా వస్తే మాత్రం ముందుగా ప్రభుత్వం పెట్టిన కండిషన్ కు ఒప్పుకుంటేనే రేట్లు పెరుగుతాయని చెప్పాడు.. అలా ఎవరైనా వస్తే ముందుకు సమాజానికి డ్రగ్స్ నిర్మూలన వంటి వాటి పై వీడియోలు చేసి ప్రమోట్ చేసిన తర్వాతే టిక్కెట్ల ధరలు, లేదా మరే ఇతర కారణాలతో వచ్చిన వెనక్కి వెళ్ళాల్సిందే అని తేల్చి చెప్పేసాడు..
ముఖ్యంగా నిర్మాతలు దగ్గరుండి సినిమాలోని ప్రముఖ నటుల చేత ఇలాంటి మేసేజ్ వీడియోలను చేయించాలని చెప్పాడు.. అంతేకాదు సినిమాలు తీయ్యడానికి పరిమిషన్లు కావాలన్న కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా వీడియోలు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం పై మాట్లాడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మరి దీనిపై నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి .. మరి వారంతా సీఎం నిర్ణయాన్ని స్వీకరిస్తారా ? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైన సీఎం నిర్ణయం అందరికి నచ్చడంతో పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు..
డ్రగ్స్ నిర్మూలనపై చిరంజీవి వీడియో చేసిచ్చారు..
డ్రగ్స్ నియంత్రణలో యాక్టర్లంతా భాగం కావాలి.
అలా అయితేనే సినిమాలకు రాయితీలు ఉంటాయి.
సీఎం రేవంత్ రెడ్డిFollow @bigtvtelugu for more updates#TollywoodActress #Telangana #CMrevanthreddy #MegastarChiranjeevi #TeluguNews… pic.twitter.com/MyXSWSUrKI
— BIG TV Breaking News (@bigtvtelugu) July 2, 2024