Jani Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి అందరికి తెలుసు.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు.. ఈయన డ్యాన్స్ స్టెప్పులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఇక మాస్టర్ మాత్రం మెగా ఫ్యామిలీకి నమ్మినబంటు .. మెగా హీరోలంటే ఎనలేని అభిమానం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. నిన్న ఈయన పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆయనకు స్పెషల్ విషెస్ చెప్పారు.. తాజాగా మాస్టర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేసాడు.
ఆ ట్వీట్ లో మాస్టర్ .. సరైన సమయంలో ఆదుకునేవాడు దేవుడని అన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ నన్ను ప్రత్యేకంగా ఇంటికి పిలవడం చూస్తే వారికి నా మీద ఎంతప్రేమ ఉందో అర్థమవుతుంది. వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా.. అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది.
నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టి. ఎఫ్. టి. టి. డి. ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఇక గతంలో మాస్టర్ జనసేన కండువా కప్పుకున్న సంగతి తెలిసిందనే.. ఎమ్మెల్ల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కానీ అది కేవలం ప్రచారంగానే మిగిలింది.. మాస్టర్ పై ఇటీవలే కొన్ని ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే .. కానీ మాస్టర్ పెద్దగా వాటిని పట్టించుకోలేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.
సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు 🙏
నా పుట్టినరోజు సందర్భంగా @AlwaysRamCharan అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా.
అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ @KChiruTweets గారి ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న @upasanakonidela వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000… pic.twitter.com/BSgp2oih0G
— Jani Master (@AlwaysJani) July 3, 2024