Vishwambhara : 8ఏళ్ళ తర్వాత ఆ స్టార్ కొరియోగ్రాఫర్ తో మెగా స్టెప్పులు!

Vishwambhara : టాలీవుడ్ లో డాన్స్ లకు పెట్టింది పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోలు అదిరిపోయే స్టెప్పులేస్తున్నా, డాన్స్ అంటే టాలీవుడ్ లో ముందు గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ప్రభుదేవా, లారెన్స్, శివశంకరం మాస్టర్ వంటి ఎంతో మందిని స్టార్ కొరియోగ్రాఫర్లను పైకి తీసుకొచ్చారు మెగాస్టార్. ఇప్పటికి డాన్స్ మాస్టర్లు అందరికి ఆదర్శంగా నిలిచేది చిరు. అయితే కెరీర్ లో గ్యాప్ తీసుకున్న తర్వాత ఎంతో మంది శేఖర్ , జానీ లాంటి డాన్స్ మాస్టర్లు చిరుతో సినిమా చేయలేమని బాధ పడ్డారు. కానీ ఖైదీ నెం150 తో రీ ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఖుషి చేశారు మెగాస్టార్. అయితే ఆ సినిమాలో అందరికి గుర్తుండేది ఫస్ట్ సాంగ్ రత్తాలు. ఈ సాంగ్ కి రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ చేసాడని తెలిసిందే. ఇందులో చిరు ఐకానిక్ వీణ స్టెప్ ని రేపటి చేసి థియేటర్లో కేక పుట్టించారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కాంబో రిపీట్ అవుతుంది.

Raghava Lawrence choreographing Chiranjeevi in ​​Vishwambhara

విశ్వంభరలో లారెన్స్ మెగాస్టెప్పులు..

అయితే ఖైదీ నెం150 తర్వాత మళ్ళీ చిరు తో వర్క్ చేయలేదు లారెన్స్. తాజా సమాచారం ప్రకారం చిరు కోసం లారెన్స్ మళ్ళీ డాన్స్ కంపోజ్ చేయనున్నాడని తెలుస్తుంది. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కోసం ఓ ప్రత్యేకమైన ఇంట్రో సాంగ్ ని రెడీ చేస్తున్నారట మేకర్స్. ఈ సాంగ్ కోసం చిరుతో అదిరిపోయే స్టెప్పులు చిరుతో వేయిస్తున్నాడట లారెన్స్. ఈ విషయం తెలిసినప్పటినుండి మెగాఫ్యాన్స్ ఈ న్యూస్ ని తెగ వైరల్ చేస్తున్నారు. ఖైదీ నెం 150 తర్వాత అంటే దాదాపు 8 ఏళ్లకు చిరుతో లారెన్స్ వర్క్ చేయనుండడం విశేషం. మరి ఆ సాంగ్ ని డైరెక్టర్ ఏ రేంజ్ లో చిత్రీకరిస్తున్నారో తెలియాలి. ఇక వీరి కాంబోలో హిట్లర్, బావగారు బాగున్నారా, మృగరాజు, ఇంద్ర, ఠాగూర్ లాంటి సినిమాల్లో స్టెప్పులు ఏ రేంజ్ లో పాపులర్ అయ్యాయో తెలిసిందే.

- Advertisement -

సగానికి పైగా పూర్తైన విశ్వంభర…

ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర (Vishwambhara) ఈ ఏడాది సంక్రాంతి ముగియగానే షూటింగ్ స్టార్ట్ కాగా, నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే సగానికి పైగా అంటే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. ఈ మధ్యనే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలని పూర్తి చేయగా, త్వరలోనే ఈ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారట. ఇక త్వరలోనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే టీజర్ మాత్రం చిరంజీవి బర్త్ డేకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు