Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కారు ఆపి ఆ పిల్లాడు తో ఏమి మాట్లాడడంటే

Pawan Kalyan:తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ని కలవాలని చాలామంది ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఆ అదృష్టం అందరికీ దక్కదు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా చాలామంది నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే సినిమాలు చేయడానికి రెడీగా ఉంటారు. డబ్బులు ఎక్కువ పెట్టడానికి కూడా వెనుకాడరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలను నిర్మించిన దిల్ రాజు కి కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి దాదాపు 20 ఏళ్లు పైన పట్టింది.

ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరుగుతున్నారు. 2024 లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పోషించిన పాత్ర అందరికీ తెలిసిందే. దాదాపు ఒక సీఎంను డిసైడ్ చేసేంత స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆంధ్ర ప్రదేశ్ లో బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అందుకే ఎక్కువగా ప్రజల్లో కనిపిస్తూ ప్రజలతో ఉంటున్నారు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. ఇక కొన్ని రోజులు గ్యాప్ దొరికితే ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసే పనిలో పడ్డారు.

Pawan Kalyan

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా ఒక వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ కాన్వే వెళ్తున్న దారిలో ఒక పిల్లాడు జనసేన జెండా పట్టుకుని నిలబడ్డాడు. అయితే ఎవరూ ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ కారు అక్కడ ఆగి ఆ పిల్లోడిని కలిసి మాట్లాడారు. ఇకపోతే ఆ పిల్లోడి దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్లి బాగున్నావా, బాగా చదువుతున్నావా అని అడిగారట. ఇక పిల్లోడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన అసలు ఆగుతారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆగి ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడి ఫోటో దిగారు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు