Samantha: ఆ హీరో వల్లే.. సమంత వైవాహిక బంధమే చెడిపోయిందా..?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే నాగచైతన్య తో ప్రేమలో పడిన ఈమె ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు రహస్యంగా ప్రేమించుకుని.. చివరికి పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకుంది. ఇక ఈ క్యూట్ జంట ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంది.. అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.. ముఖ్యంగా వీరి విడాకులకు సంబంధించిన ఎన్నో రూమర్స్ సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతూనే ఉంటాయి.. కానీ ఎవరూ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.. ఇదిలా ఉండగా ఇప్పుడు మరొక రూమర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే సమంత నాగచైతన్య విడిపోవడానికి చిరంజీవి కూడా ఒక కారణం అని అంటున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Samantha: Because of that hero.. Samantha's marital relationship is ruined..?
Samantha: Because of that hero.. Samantha’s marital relationship is ruined..?

రంగస్థలంలో అవకాశం..

అసలు విషయంలోకి వెళితే.. సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ నటించిన చిత్రం రంగస్థలం.. ఈ సినిమాలో సమంతకు నటించే అవకాశం వచ్చింది.మొదట ఈ సినిమాలో సమంత వద్దు అని చిత్ర బృందం అనుకొనింది.. సెలబ్రిటీ ఇంటికి కోడలిగా వెళ్ళింది.. ఇప్పుడు సినిమాల్లో చేస్తుందో లేదో అని ఆలోచించారు కూడా.. అయితే ఇదే విషయాన్ని చిరంజీవితో చర్చిస్తే.. ఆయన.. తనకు పెళ్లి అయిపోతేనేమీ ఆమె ఒక హీరోయిన్ కదా.. క్యారెక్టర్ నచ్చితే చేయమని చెప్పండి అని చెప్పారట.. దీంతో సమంతకు కథ వినిపించగా ఆమె కూడా ఆ పాత్ర నచ్చడంతో ఓకే చెప్పేసింది. ఇక సినిమా కూడా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

విడాకులకు కారణం చిరంజీవి కూడా…

వివాహానికి ముందు ఎంత పాపులారిటీ అయితే దక్కించుకుందో వివాహం తర్వాత కూడా అంతే ఇమేజ్ సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేసింది సమంత.. అందులో భాగంగానే రంగస్థలం సినిమా మంచి విజయం సాధించడంతో ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కి కూడా సైన్ చేసింది.. ఈ సిరీస్ తర్వాత అనుకోని విధంగా ఈమె జీవితం మలుపు తిరుగుతుందని అప్పుడు అనుకోలేదేమో. ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించడంతో నాగచైతన్య అసహనం వ్యక్తం చేయడం… ఇంట్లో కుటుంబ సభ్యులు సమంతను సినిమాలలో నటించడం ఆపేయమని చెప్పడం.. అన్నీ కూడా విడాకులకు కారణమయ్యాయి.. ఇలా ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది.. దీన్ని బట్టి చూస్తే సమంత, నాగచైతన్య మధ్య విడాకులు జరగడానికి ఒక రకంగా చిరంజీవి కూడా కారణమని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త వార్త తెరపైకి వచ్చింది.. మరి దీనిపై చిరంజీవి, సమంత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు