Kalki 2898AD Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన సినిమా కల్కి 2898 AD.. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.. ప్రతి ఏరియాల్లోను ఊచకొత మొదలెట్టింది.. రోజు రోజుకు కోట్ల కలెక్షన్ ను కొల్లగొట్టింది.. ఆరురోజులకు గానూ రూ. 700 కోట్లను రాబట్టింది అంటే మామూలు విషయం కాదు.. ఇక ఈరోజు ఎంత వసూల్ చేసిందో ఒకసారి చూసేద్దాం పదండీ..
గత వారంలో ఉన్న కలెక్షన్స్ ఇప్పుడు రావట్లేదని తెలుస్తుంది.. వీకెండ్ కలెక్షన్స్ భారీగా వస్తే.. నిన్న, మొన్న కాస్త తగ్గినట్లు తెలుస్తుంది.. అయితే.. ఇప్పటి వరకు కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. కల్కి విడుదలై వారం రోజులు గడుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో మరో వారం రోజులు ఇదే జోరు కొనసాగితే కల్కి కచ్చితంగా రూ. 1000 కోట్ల ఫిగర్‌ను టచ్ చేయడం ఖాయం. ప్రస్తుతం ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడం వచ్చే వారాంతం కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.. మరో వెయ్యి కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి..
ఈ సినిమాకు నిన్న కలెక్షన్స్ బాగానే రాబట్టింది.. ఈరోజుకు రూ. 747 కోట్ల గ్రాస్ ను రాబట్టింది..ఈ వీకెండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి… అయితే సినిమాకు ముందు దాదాపు 2 వేల కోట్లకు పైగా రాబడుతుందని కల్కి నిర్మాత అశ్విన్ దత్ చెప్పారు.. కానీ ఇప్పుడు కలెక్షన్స్ రోజు రోజుకు తగ్గుతున్నాయి.. మరి అన్ని కోట్లు రాబడుతుందా.. లేదా అన్నది చూడాలి.. ఇక ఈ సినిమాలో అమితాబ్, కమల్‌హాసన్, దీపికా పదుకొణెతో పాటు మరికొందరు అగ్ర నటీనటులు నటించారు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండనుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. పార్ట్ 2కి సంబంధించి కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీ కరించారని నిర్మాత అశ్వీని దత్ తెలిపారు.. త్వరలో సినిమా గురించి ప్రకటన రాబోతుందని సమాచారం..