Kalpana Rai : ఆమె చేసిన మోసం వల్లే ఈ లేడి కమెడియన్ చివరిరోజుల్లో అన్ని భాధలు అనుభవించిందా?

Kalpana Rai : ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో లేడీ కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కల్పనా రాయ్ కూడా ఒకరు.. తన మార్క్ కామెడితో సినిమాల్లో కడుపుబ్బా నవ్విస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ అయ్యింది.. ఆమె ఎన్నో వందల సినిమాలు చేసింది.. సినిమాల్లో ఆదరించినంతగా రియల్ లైఫ్ లో ఎవరు ఆమె పట్టించుకోలేదు.. చివరి రోజుల్లో దయనీయ స్థితిలోకి వెళ్లింది.. ఒక అనాధలాగా చనిపోయింది.. తన కూతురు చేసిన ఆ ఒక్క తప్పే ఆమె ఆ పరిస్థిలోకి వెళ్లడానికి కారణం అని తెలుస్తుంది..

కల్పనా ఆంధ్రప్రదేశ్ కాకినాడ లో 1950 లో జన్మించింది.. అప్పట్లో సన్నగా నాజుగ్గా ఉండటంతో సినిమాలపై ఆసక్తి తో సినిమాల్లోకి వచ్చేసింది.. “నీడలేని ఆడది” సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమాతో నటిగా పాపులారిటిని సంపాదించుకుంది.. ఆ తర్వాత లేడి కమెడీయన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. ఈమె దాదాపు 440 సినిమాల్లో నటించింది.. అందులో జంబలకిడి పంబ, ప్రేమించచుకుందాం రా, కలిసుందం రా వంటి సినిమాలు ఆమెకు మంచి పేరును అందించాయి.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా మంచి పేరును సంపాదించి పెట్టాయి..

Kalpana Rai died in a situation where even funeral had no money
Kalpana Rai died in a situation where even funeral had no money

అయితే ఎంత సంపాదించిన అందులో కొంత తన చుట్టు ఉన్న వారికి సాయం చేసేది.. అదే ఆమెకు శాపంగా మారింది.. వయసు తగ్గిన తర్వాత ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు.. అంతేందుకు దత్తత తీసుకొని అన్నీ తానై పెంచుకున్న కూతురు వయసు రాగానే ప్రేమించిన వ్యక్తితో లేచిపోయింది.. ఆ బాధే ఆమెను మరింత క్రుంగిపోయేలా చేసింది.. ఆ దెబ్బతో మంచాన పడింది.. అనేక అనారోగ్య సమస్యలు ఆమెను చుట్టిముట్టాయి. అత్యంత దారుణ పరిస్థితులలో ఆమె చనిపోయింది.. అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి సమయంలో మా మూవీ అసోసియేషన్ ముందుకు వచ్చి ఈమె అంతక్రియలను జరిపించినట్లు తెలుస్తుంది… కూతురు దూరం అయ్యిందనే బాధే బాగా కృంగిపోయేలా చేసింది.. ఇలాంటి గొప్ప నటులు మళ్ళీ ఇండస్ట్రీకి దొరికరు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు