Suhas Remuneration : ఒక్క కోటి కూడా లేదు కానీ 3 కోట్లు అని చెప్పుకున్నాడు… కట్ చేస్తే ఆఫర్స్ అన్నీ మిస్

Suhas Remuneration : కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతికి ఎలాంటి గుర్తింపు ఉందో మన అందరికీ తెలుసు. ఆయన ఎంచుకున్న స్టోరీ అంటేనే ఓ రకమైన హైప్ ఉంటుంది. అందుకే విజయ్ సేతుపతి సినిమాలను చాలా మంది మిస్ చేయకుండా చూస్తు ఉంటారు. అయితే టాలీవుడ్ లో కూడా ఓ విజయ్ సేతుపతి ఉన్నారు. ఆయనే సుహాస్. ఎక్కడో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉన్న సుహాస్… కలర్ ఫోటోతో ఒక్కసారిగా హీరో అయిపోవడమే కాదు… ఓ వర్గం ఆడియన్స్ ఆయనను ఓన్ చేసుకునేలా చూసుకున్నాడు.

దీని తర్వాత నుంచి సుహాస్ సోలోగా మూవీలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవల ప్రసన్నవదనం సినిమా ప్రమెషన్స్ టైంలో సుహాస్ కి ఓ క్వశ్చన్ ఎదురైంది. “మీరు రెమ్యునరేషన్ బాగా పెంచారట కదా…” అని ఓ జర్నలస్ట్ అడిగితే.. “అవును.. నేను కూడా బతకాలి కదా.. 1000 రూపాయల రెమ్యునరేషన్ నుంచి 3 కోట్ల వరకు వచ్చాను” అంటూ మీడియా ముందే చెప్పాడు.

This is the real truth of Suhas claiming to be getting high remuneration
This is the real truth of Suhas claiming to be getting high remuneration

15 కోట్ల మూవీ ఆఫర్

అయితే సుహాస్ కు మూడు కోట్ల రెమ్యునరేషన్ అనేది నిజం కాదట. ప్రసన్నవదనం సినిమాకు సుహాస్ కు వచ్చిన పారితోషికం దాదాపు 60 లక్షలు. అయితే ఈ ప్రసన్నవదనం నిర్మాత సుహాస్ తో ఓ ఒప్పదం చేసుకున్నారట. ఈ సినిమా తర్వాత ఓ భారీ సినిమా చేస్తానని, దానికి 15 కోట్ల వరకు బడ్జెట్ అని చెప్పారట. ఈ కథకు సుహాస్ నే హీరోగా ఎంపిక చేసి 3 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశాడట ఆ నిర్మాత.

- Advertisement -

ప్రసన్నవదనం ఎఫెక్ట్

అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్న ప్రసన్నవదనం మూవీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేక పోయింది. 7 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీకి టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయని ప్రచారం చేసుకున్నారు. కానీ, పెద్దగా రికవరీ కాలేదు అనేదే నిజం అని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్రసన్నవదనం కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవడంతో 15 కోట్ల బడ్జెట్‌తో సుహాస్ హీరోగా చేయాలి అనుకున్న ఆలోచనను ఆ నిర్మాత హోల్డ్ లో పెట్టారట.

సుహాస్ కు జరిగిన డ్యామేజ్

సినిమా హోల్డ్ లో పడింది. అయితే ఈ గ్యాప్‌లో సుహాస్ కు జరిగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయిందట. ప్రసన్నవదనం వరకు సుహాస్ చాలా వరకు క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. సుహాస్ ను ఆడియన్స్ ఎలా చూడాలి అని అనుకుంటున్నారో అలాంటి సినిమాలన్నీ కూడా సుహాస్ వరకు రాలేకపోయాయి. 3 కోట్లు రెమ్యునరషన్ అని తెలియడంతో చాలా మంది నిర్మాతలు.. సుహాస్ స్థానంలో మరో యంగ్ హీరోతో తమ సినిమాలు చేసుకోవాలని అనుకుంటున్నారట. దీంతో సుహాస్ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు కోల్పోయాడు అని ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇప్పుడున్న పరిస్థితి…

3 కోట్లు అని చెప్పుకున్న తర్వాత కొన్ని ఆఫర్స్ మిస్ అయ్యాయి. దీంతో మళ్లీ కోటి రూపాయల లోపు రెమ్యునరేషన్‌తోనే సుహాస్ సినిమాలు చేస్తున్నాడని టాక్. గత కొన్ని రోజుల నుంచి సుహాస్ నుంచి చాలా సినిమాల అనౌన్స్ మెంట్ వచ్చాయి. ఆ సినిమాకు సుహాస్ కు వచ్చే రెమ్యునరేషన్ కోటి రూపాయల లోపే అని Filmify కి వచ్చిన సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు