Vishwambhara : విశ్వంభర నుండి సాలిడ్ అప్డేట్.. ఈ పని జెట్ స్పీడ్ లో మొదలెట్టేశారే!

Vishwambhara : టాలీవుడ్ లో ఈ ఏడాది ఆల్రెడీ చాలా బడా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుండగా, వచ్చే ఏడాది కూడా వచ్చే సినిమాలు ఇప్పటినుండే పక్కాగా షూటింగ్ పూర్తి చేస్తూ, అనుకున్న టైం కి వద్దామని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే బడా సినిమాల్లో అన్నిటికంటే ముందు వచ్చేది “విశ్వంభర”. లెజెండరీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. రెగ్యులర్ షూటింగ్ ని నాన్ స్టాప్ గా ఫినిష్ చేస్తున్నారు. ఇక బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు విశ్వంభరని ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా విశ్వంభర మేకర్స్ నుండి సాలిడ్ అప్డేట్ వచ్చింది.

Makers started dubbing for Vishwambhara movie with Pooja

అప్పుడే డబ్బింగ్ పనులు కూడా మొదలెట్టేస్తున్నారు..

విశ్వంభర (Vishwambhara) మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో పూర్తి చేసుకుంటుండగా, చిరు కూడా వేరే ఏ సినిమా కూడా స్టార్ట్ చేయకుండా ఈ సినిమాపైనే మొత్తం ఫోకస్ పెట్టారు. ఇక ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బర్త్ డే సందర్భంగా చిరు ఆల్రెడీ కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని కూడా అందించారు. కాగా చిత్ర నిర్మాతలు అయిన యూవీ క్రియేషన్స్ వారు కూడా మరో సాలిడ్ అప్డేట్ ని అందించారు. అదేంటంటే… విశ్వంభర సినిమాకి సంబంధించి డబ్బింగ్ పనులని ఈరోజు నుంచి పూజా కార్యక్రమాలతో ఆరంభిస్తున్నట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమా యొక్క డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటుగా షూటింగ్ ని కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు రివీల్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఇంత జెట్ స్పీడ్ గా మొదలుపెట్టారంటే సినిమా డిసెంబర్ కి ముందే షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు.

- Advertisement -

సంక్రాంతి టార్గెట్ గా జెట్ స్పీడ్ లో…

ఇక తాజాగా డబ్బింగ్ పనులు మొదలుపెట్టడం చూసి నెటిజన్లు విశ్వంభర షూటింగ్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ అయ్యి సంక్రాంతి కి ఖచ్చితంగా వస్తుందని నమ్మకంగా చెపుతున్నారు. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా వంటి యంగ్ హీరోయిన్లు చిరంజీవి చెల్లిపాత్రల్లో నటిస్తున్నారు. అలాగే హర్ష వర్ధన్, వెన్నెల కిషోర్, రావు రమేష్, కునాల్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరుతో ఓ స్పెషల్ సాంగ్ ని రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారని సమాచారం. తాజాగా ఇచ్చిన అప్డేట్ లో మేకర్స్ సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని మరోసారి కన్ఫర్మ్ చేసారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు