Tollywood Actress: ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలలో నటించి.. ఇప్పుడు ఇడ్లీలు అమ్ముకుంటున్న నటి..!

Tollywood Actress.. సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో చెప్పడం చాలా కష్టం. ఏమీ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వాళ్ళు కుబేరులు అవుతుంటే.. మరికొంతమంది బాగా డబ్బు సంపాదించినా.. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి ఉన్నదంతా పోగొట్టుకుంటూ ఉంటారు. హీరోల సినిమాలలో కూడా నటించి చివరికి అవకాశాలు లేక రోడ్డు సైడ్ వ్యాపారాలు చేసుకుంటూ కనిపించిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు.. ఇకపోతే మరికొంతమంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు ఎన్నో కష్టాలు దాటి వస్తారు.. తమను తాము ఒక్కసారైనా స్క్రీన్ మీద చూసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు… ఒక్క ఫ్రేమ్ లో తాము ఉన్నా .. తామే హీరోయిన్ అన్నంత రేంజ్ లో ఫీల్ అయిపోతుంటారు.. ఆ మత్తులోనే ఉంటూ మూలాలు మర్చిపోయిన వారు ఎంతోమంది .. కానీ ఎన్నో సీరియల్స్ లో నటించి అడపా దడపా సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్న ఒక నటి ఇప్పటికీ తమ ఊర్లో టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తోంది..

Tollywood Actress: Once acted in the movies of star heroes.. Now the actress is selling idlis..!
Tollywood Actress: Once acted in the movies of star heroes.. Now the actress is selling idlis..!

ఆస్తులు సంపాదించిన మూలాలు మర్చిపోకూడదు అంటున్న నటి..

షూటింగ్లో ఉన్నప్పుడు వెళ్లి నటించి తిరిగి తన పని చేసుకుంటుంది. ఆమె ఎంత ఎత్తుకు ఎదిగినా.. మూలాలు మరిచిపోకూడదని.. అలాగే తమ ఎదుగుదలకు కారణమైన వాటిని వదులుకోకూడదని అంటోంది. రంగుల ప్రపంచమైన సినిమా అనే మత్తులో దిగిన తర్వాత జీవితానికి సరైన బాటలు వేసుకోకుంటే ఇబ్బందులు తప్పవని ఎంతోమంది నిరూపించారు కూడా.. అలాంటి వారిలో మహానటి సావిత్రి కూడా ఒకరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగి వేల కోట్లాది రూపాయలను ఆమె సొంతం చేసుకుంది.. అయితే ఆ తర్వాత జల్సాలకు పోవడమే కాదు అడిగిన వారికి లేదనుకుండా ఆర్థిక సాయం చేసింది. ఆఖరికి సహాయం చేయడం అనే మత్తులో పట్టుచీరలు కూడా అమ్మి .. డబ్బులు ఇచ్చిన ఆమె చివరికి ఏమీ లేకుండా అనాధగానే మరణించారు. ఇలా చాలామంది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత తిరిగి తమ పాత వాసనలు పట్టించుకునే వారు తక్కువే.. కానీ తాను మాత్రం అలాంటి దానిని కాదు అని నిరూపించారు బుల్లితెర నటి తాటి గీత..

రోడ్డు సైడ్ ఇడ్లీలు అమ్ముకుంటూ..

పదుల సంఖ్యలో సీరియల్స్ లో నటించి , అడపా దడపా సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న ఈమె ఇప్పటికీ తమ సొంత ఊర్లో రోడ్డు పక్కన చిన్న బండి పైన హోటల్ నడుపుతోంది. నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందిన తాటి గీత బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించింది. మనసు మమత, గృహప్రవేశం , నిన్నే పెళ్లాడుతా, రాధమ్మ కూతురు, గుప్పెడంత మనసు, నాలుగు స్తంభాలాట వంటి ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె… మహర్షి, భగవంత్ కేసరి, గేమ్ ఛేంజర్ వంటి చిత్రాలలో కూడా నటించింది. అలాగే ప్రేమ వివాహం, భీమదేవరపల్లి బ్రాంచ్ , యద్భావం తద్భవతి, తమసోమా జ్యోతిర్గమయ, ట్రెండింగ్ లవ్ స్టోరీ వంటి చిత్రాలలో కూడా కనిపించింది.. ముఖ్యంగా హీరో హీరోయిన్ల కి తల్లిగా కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.. ఇంకా అనుకున్నన్ని అవకాశాలు రాకపోవడంతో.. ఏమాత్రం బాధపడకుండా తిరిగి తన స్వగ్రామం వచ్చి రోడ్డు పక్కనే హోటల్ నిర్వహిస్తోంది.. ఎవరైనా వేషం ఇస్తే వెళ్లి నటిస్తానని చెబుతోంది.. మొత్తానికైతే ఈమెకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Geetha Thati (@thatigeetha)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు