Darshan: దర్శన్ – పవిత్ర గౌడ పెళ్లి పై షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన దర్శన్ భార్య..!

Darshan: ప్రముఖ కన్నడ హీరో దర్శన్ అభిమానిని హత్య చేసిన కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రముఖ సీరియల్ నటి పవిత్ర గౌడతో ఆయన రిలేషన్ లో ఉన్నారు. ఇదే విషయాన్ని పవిత్ర గౌడ.. తమ రిలేషన్ కు పది సంవత్సరాలు అంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో.. దర్శన్ వీరాభిమాని రేణుకా స్వామి ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.. మా అన్న జీవితాన్ని నాశనం చేస్తున్నావు.. మా అన్న కుటుంబానికి అన్యాయం చేస్తున్నావు.. అంటూ పవిత్ర గౌడను సోషల్ మీడియాలో పూర్తిస్థాయిలో విమర్శించారు.. దీంతో హర్ట్ అయిన పవిత్ర గౌడ, దర్శన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అతడిని హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది ..ఇప్పటికీ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. భర్తను విడిపించుకోవడానికి దర్శన్ భార్య ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.. ఇదిలా ఉండగా ఇప్పుడు మరొకవైపు ఈయన దర్శన్ , పవిత్ర గౌడల రిలేషన్ పై షాకింగ్ కామెంట్లు చేస్తూ భారీ ట్విస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు..

పవిత్ర గౌడ దర్శన్ భార్య కాదు..

Darshan: Darshan - Darshan's wife gave a shocking twist on Pavitra Gowda's wedding..!
Darshan: Darshan – Darshan’s wife gave a shocking twist on Pavitra Gowda’s wedding..!

అసలు విషయంలోకెళితే అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ ..అతడు స్నేహితురాలు పవిత్ర గౌడ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు.. విచారణలో భాగంగా పోలీసులు వీరిద్దరిని దంపతులుగా పేర్కొనడంతో.. దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె దర్శన్ భార్య కాదంటూ బెంగళూరు పోలీస్ కమీషనర్ బి.దయానందకు లేఖ రాసింది.. ఆ లేఖలో ఏముంది అనే విషయానికొస్తే..తాజాగా మీడియా సమావేశంలో పవిత్ర.. దర్శన్ భార్య అంటూ మీరు తప్పుగా ప్రకటించారు ..ఆ తర్వాత కర్ణాటక హోం మంత్రి కూడా ఇదే మాట అన్నారు .ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నటుడు దంపతులు అరెస్టయ్యారని ఆ మంత్రి చెప్పారు.. ఆమె దర్శన్ భార్య కాదు కేవలం నా భర్తకు స్నేహితురాలు మాత్రమే.. దర్శన్ కు చట్టపరమైన జీవిత భాగస్వామిని నేను. 2003లో మా పెళ్లి జరిగింది.. పోలీస్ రికార్డుల్లోనూ దర్శన్ భార్య అంటూ మీరు పేర్కొన్నారు..అలా చేయవద్దు.. అది భవిష్యత్తులో నాకు, నా కుమారుడికి సమస్యలు తీసుకొస్తుంది.. పవిత్రకు సంజయ్ సింగ్ అనే వ్యక్తితో వివాహమైంది.. వారికి ఒక కూతురు కూడా ఉంది.. దయచేసి ఈ వాస్తవాలను రికార్డులో స్పష్టంగా రాయండి అంటూ ఆమె తన లేఖలో అభ్యర్థించింది.

జూలై 18 వరకూ జ్యూడిషియల్ కస్టడీ..

ఇకపోతే దర్శన్ , పవిత్ర బంధం విజయలక్ష్మి కి అన్యాయం చేసిందని.. భావించిన దర్శన్ అభిమాని రేణుక స్వామి.. పవిత్రకు అశ్లీల సందేశాలు , అసభ్య హెచ్చరికలు చేశాడని పోలీసులు గుర్తించారు.. అదే అతడి హత్యకు దారి తీసింది అని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇకపోతే ఈ కేసులో దాదాపు 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.. వీరంతా కూడా ఇప్పుడు కస్టడీలో ఉన్నారు . జూలై 18 వరకు కస్టడీని తొలగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది కోర్టు.. మొత్తం 17 మంది నిందితులను దర్శన్, పవిత్ర లను బెంగళూరు తుమకూరు జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జూలై 18 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు