Smriti Biswas passed away : 100 ఏళ్ల వయసులో అలనాటి నటి మృతి… అద్దె ఇంట్లో తిరిగిరాని లోకాలకు

Smriti Biswas passed away : ప్రఖ్యాత నటి స్మృతి బిస్వాస్ నారంగ్ తాజాగా కన్నుమూశారు. హిందీ, బెంగాలీ చిత్రాలలో తన ఐకానిక్ పాత్రలకు ప్రసిద్ధి చెందిన ఆమె బుధవారం సాయంత్రం వయసు సంబంధిత సమస్యల కారణంగా మృతి చెందింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పుట్టినరోజును జరుపుకున్న స్మృతి 100 ఏళ్ల వయసులో అద్దె ఇంట్లో తుది శ్వాస విడవడం విచారకరం. గురువారం ఉదయం 10 గంటలకు క్రైస్తవ మతాచారాలతో ఆమె అంత్యక్రియలు జరిగాయి.

ఆస్తులు ఉన్నా అద్దె ఇంట్లోనే..

స్మృతికి ముంబైలో చాలా ఆస్తులు ఉన్నట్టుగా సమాచారం. అయితే ఏం జరిగిందో తెలీదు కానీ 28 సంవత్సరాల క్రితం తన క్రైస్తవ మిషనరీ సోదరి వద్ద నివసించడానికి నాసిక్ వెళ్లి, అక్కడ ఒక సాధారణ ఇంట్లో నివసించింది. అప్పటి నుంచి అక్కడే ఉండగా, తాజాగా తుది శ్వాసను కూడా ఆమె అక్కడే విడిచినట్టు సమాచారం.

పెళ్లి తరువాత సినిమాలకు బ్రేక్

10 సంవత్సరాల వయస్సులో బెంగాలీ చిత్రం సంధ్యలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. కోల్‌కతాలో నిర్మించిన హేమంత బోస్ ద్వాంద్వా, మృణాల్ సేన్ నీల్ ఆకాషెర్ నీ ఆర్ సహా అనేక చిత్రాలలో నటించింది. 1930ల నుండి 1960ల వరకు మూడు దశాబ్దాల పాటు నెక్ దిల్, అపరాజిత, మోడరన్ గర్ల్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో స్మృతి నటించింది. ఆమె ఎన్నో హిందీ, మరాఠీ, బెంగాలీ చిత్రాలలో నటించారు. గురుదత్, వి శాంతారామ్, మృణాల్ సేన్, బిమల్ రాయ్, బిఆర్ చోప్రా, రాజ్ కపూర్ చిత్రాలలో, దేవ్ ఆనంద్, కిషోర్ కుమార్, ఇతర ప్రముఖ నటులతో కలిసి నటించింది. 1960లో చిత్ర దర్శకుడు ఎస్‌డి నారంగ్‌ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు దూరమైంది.

- Advertisement -

మరణానికి ముందు నిరుపేద జీవితం

స్మృతి బిస్వాస్, ఫిల్మ్ మేకర్ ఎస్‌డి నారంగ్‌ దంపతులకు రాజీవ్, సత్యజిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తన భర్త మరణం తర్వాత, ఆమె తన సోదరితో నివసించడానికి నాసిక్‌కు మారింది. తన జీవితంలో చివరి రోజుల్లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. స్మృతి తన 100వ పుట్టినరోజును 17 ఫిబ్రవరి 2024న జరుపుకుంది.

बेटे सत्यजीत और राजीव के साथ स्मृति बिस्वास।

ఆమె మరణానికి ముందు నాసిక్‌లో నిరుపేద జీవితం గడుపుతున్నారని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ విచారం వ్యక్తం చేసింది. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ నటి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. నిన్నటితరం నటి స్మృతి బిశ్వాస్‌ మరణవార్త విని ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శతజయంతి జరుపుకున్న స్మృతి బిశ్వాస్ 1940లు, 50లలో అత్యంత శక్తివంతమైన, మనోహరమైన నటులలో ఒకరు. ఒకరకంగా చెప్పాలంటే డ్రీం గర్ల్. మోడల్ గర్ల్ (1960) ఆమె చివరి హిందీ చిత్రం.

దర్శకుడు హన్సల్ మెహతా నివాళులు

స్మృతి మృతి పట్ల ఇండస్ట్రీలోని వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా మాపై మీ ఆశీర్వాదాలు కురిపించినందుకు ధన్యవాదాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ ఆమెకు నివాళులు అర్పించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు