Chiranjeevi 10th Marks : మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఆయన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది? అనే విషయంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ చిరు జీవితం తెరిచిన పుస్తకం వంటిది. అయినప్పటికీ ఆయన గురించి మెగా ఫ్యాన్స్ కు సైతం తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఆయన టెన్త్ మార్క్స్.
కానిస్టేబుల్ కొడుకు నుంచి పద్మవిభూషణ్ చిరంజీవిగా..
చిరంజీవి సాధారణ కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టి.. ఎన్నో కష్టాలు పడి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత హీరోగా మారి, మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగాడు. తన స్టైల్ లో నటన, డ్యాన్స్, సామాజిక సేవ ఇలా ఎన్నో అంశాలు ఆయన్ను ప్రజలకు దగ్గర చేశాయి. అంతేకాదు తన గ్రేస్, మంచితనంతో ఇండస్ట్రీలో చిరంజీవి తన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు. బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీని మించి టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ ఎదిగింది. చిరంజీవి సపోర్ట్ తో అరడజను మందికి పైగా మెగా హీరోలు టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఇందులో ఇద్దరు హీరోలు పాన్ ఇండియాను శాసిస్తున్నారు. నలుగురు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. సపోర్ట్ లేకుండా సినిమా రంగంలోకి వచ్చి టాప్ హీరో స్థాయికి ఎదగడం మాములు విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవి తన స్వయం కృషితో టాలీవుడ్లో ఈ స్థాయికి చేరుకున్నారు.
తన అద్భుతమైన నటనతో, డ్యాన్స్‌తో టాలీవుడ్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న చాలా మంది మెగాస్టార్ ని రోల్ మోడల్ గా తీసుకున్నారు. చిరు నటనతో పాటు సామాజిక సేవలో కూడా రాణించారు. కుడి చేయి చేసిన సాయం ఎడమ చేతికి తెలియకుండా చూసుకుంటాడు మెగాస్టార్. ఇటీవలే ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. 70 ఏళ్లకు చేరువైనప్పటికీ ఇప్పటికీ యువ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూనే ఉన్నాడు చిరంజీవి.
టెన్త్ సర్టిఫికెట్ వైరల్
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిరంజీవి 10వ తరగతి సర్టిఫికెట్ అది. అయితే అందులో ఆయన మార్క్స్ కు సంబంధించిన వివరాలైతే లేవు. కానీ చిరుకు సంబంధించిన పర్సనల్ డీటైల్స్ ఉన్నాయి.
మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ?
మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే… వరుస సినిమాలనే ప్లాన్ చేస్తున్నారు. ఫ్లాపులు వచ్చినా వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం చిరు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన సరసన త్రిష నటిస్తోంది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారు. దీంతో చిరంజీవిని గవర్నర్‌గా నియమించాలనే ప్రతిపాదన కూడా ఉందని టాక్ నడుస్తోంది.