Actress : దర్శక నిర్మాతలతో ఆ పని చేస్తారా? అని ఫోన్… చెంప చెళ్లుమనిపించే సమాధానం ఇచ్చిన హీరోయిన్

Actress : ఎప్పటికప్పుడు సినిమాలో ఇండస్ట్రిలో జరిగే లైంగిక వేధింపుల ఘటనలు బయటకు వస్తూనే ఉన్నాయి. కాస్టింగ్ కౌచ్ గురించి ఓ ప్రముఖ నటి తాజాగా షాకింగ్ స్టోరీని వెల్లడించింది. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన ఓ షాకింగ్ సంఘటనను షేర్ చేసుకుంది. ఆ నటి ఎవరు ? ఆమెతో అసభ్యంగా ప్రవర్తించింది ఎవరు ? అనే విషయాలను తెలుసుకుందాం రండి.

క్యాస్టింగ్ కౌచ్ కాదనలేని వాస్తవం

సినీ పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ ఉందనేది కాదనలేని వాస్తవం. తమ కెరీర్‌కు సాయం చేస్తామని చెప్పి యువతులను అడ్వాంటేజ్‌గా తీసుకునేవారు చాలా మందే ఉన్నారని కొందరు సినీ నిర్మాతలు స్వయంగా చెబుతున్నారు. అలాగే ఇప్పటికే మీటూ అంటూ ఎంతోమంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. అయితే కొంతమంది హీరోయిన్లు స్టార్ డం కోసం కమిట్మెంట్ కు కట్టుబడి ఉంటే, అలాంటి వాటికి దూరంగా ఉండేవారు కొందరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కమిట్మెంట్ జోలికి వెల్లకుండానే సక్సెస్ అయిన కొందరిలా.. తమ టాలెంట్‌ని నమ్ముకుని దేనికీ అంగీకరించకుండా పట్టుదలతో పని చేసి, చివరకు విజయం సాధించే నటీమణులు కూడా ఉన్నారు. ఆ స్థాయికి చేరుకున్న హీరోయిన్లు తమ కెరీర్ ప్రారంభంలో ఇలాంటి బాధాకరమైన అనుభవాలను పంచుకుంటారు.

అతనికి చెంప పెట్టు లాంటి సమాధానం

తాజాగా హిందీ, మరాఠీ సినిమాల్లో పాపులర్ అయిన నటి సాయి తమంకర్ కూడా కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ స్టోరీని పంచుకున్నారు. మిస్ మాలిని అనే వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి ఈ విషయాన్ని వెల్లడించారు. సాయికి కెరీర్‌ ప్రారంభంలో ఎవరో తెలియని వ్యక్తి ఫోన్ చేసి దర్శకుడు, నిర్మాతతో పడుకుంటావా అని సూటిగా అడిగాడట. దీంతో ఒక్కసారిగా షాకైన ఈ నటి ‘మీ అమ్మను పంపగలరా?’ అని సదరు వ్యక్తికి చెంపపెట్టు లాంటి బదులిచ్చిందట.

- Advertisement -

అయితే తన సమాధానాన్ని విని ఆ వ్యక్తి కొన్ని సెకన్ల పాటు మౌనంగా ఉన్నాడని, మళ్లీ మాట్లాడలేదని  సాయి పేర్కొన్నారు. అలాగే ఆ గుర్తు తెలియని వ్యక్తి మళ్లీ కాల్ చేయరు అనుకున్నాను అంటూ సాయి అతని ముఖం మీద కొట్టినట్లు బదులిచ్చానని వెల్లడించింది. ఈ అనుభవం తర్వాత తనకు అలాంటి ఫోన్ కాల్స్ రాలేదని, నాతో అలా మాట్లాడి ఉండకూడదని అతనికి బాగా అర్థమై ఉండాలి అంటూ అప్పట్లో జరిగిన ఘటనను గుర్తు చేసుకుంది.

marathi actress sai tamhankar latest bold and hot photos | In Pics: सईच्या  ग्लॅमरस अंदाजाने वेधले चाहत्यांचे लक्ष; फोटोंवर लाइक्स आणि कमेंट्सचा वर्षाव

సాయి తమంకర్ ఎవరు?

నటి సాయి తమంకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆమె జన్మించింది. స్కూల్లో, కాలేజీలో చదివేటప్పుడు నాటకాల్లో నటించేది. 17 ఏళ్ల వయసులో మరాఠీ టీవీ షోలలో నటించడం మొదలు పెట్టారు. మొదట చిన్న పాత్రలతో తన నట జీవితాన్ని ప్రారంభించిన ఈ నటి కెరీర్ మొదట్లో బాలీవుడ్‌లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. అమీర్ ఖాన్ నటించిన ‘గజనీ’ సినిమాతో సాయి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ సినిమాలో అసిన్ స్నేహితురాలి పాత్రను పోషించింది. అనంతరం సాయికి హిందీలో మంచి పాపులారిటీ దక్కింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు