Indian 2: ఇంత రన్ టైం తో ప్రేక్షకులను శంకర్ మెప్పిస్తాడా.?

Indian 2: తమిళ్ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో హిట్స్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు శంకర్. 17 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తర్వాత జెంటిల్మెన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ తర్వాత ఎన్నో హిట్ హిట్ సినిమాలు చేశారు శంకర్. శంకర్ కెరియర్ లో వచ్చిన సినిమాలు అన్నిట్లో కూడా భారతీయుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. లంచం కాన్సెప్ట్ లో తీసిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

భారతీయుడు 2 సినిమాని శంకర్ ఎప్పుడో స్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. సినిమా ఆగిపోయే పరిస్థితి కూడా ఆల్మోస్ట్ వచ్చింది. సినిమా జరుగుతున్న సమయంలో ఫైర్ ఆక్సిడెంట్ జరగడం దాని వలన అసిస్టెంట్ డైరెక్టర్స్ చనిపోవడం ఇలా ఎన్నో అవంతరాలు ఈ సినిమాకు వచ్చాయి. ఈ సినిమా దాదాపు ఆగిపోతుంది అని అనుకున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. లైకా ప్రొడక్షన్స్ తో పాటు దిల్ రాజు కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం ఉన్నారు. అయితే సినిమా లేట్ అవుతున్న కొద్ది ఈ సినిమా నుంచి దిల్ రాజు తప్పుకొని, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అదే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాను తెరకెక్కించాడు.

Indian 2

- Advertisement -

అయితే ఈ సినిమాను జూలై 12న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా అన్ని పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా రన్ టైం రీవీల్ అయింది. దాదాపు మూడు గంటల నాలుగు నిమిషాల పాటు ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది కానీ మూడు గంటలపాటు ప్రేక్షకుడిని శంకర్ కూర్చోబెట్టగలుగుతాడా అని చాలామందికి ఆలోచనలు కూడా వస్తున్నాయి. సినిమా నిజంగానే బాగుంటే డ్యూరేషన్ అనేది పెద్ద మేటర్ కూడా కాదు అని చాలాసార్లు ప్రూవ్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు