Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి తెలిసిందే.. ఈమె ప్రస్తుతం ప్రగ్నెంట్ అన్న విషయం తెలిసిందే.. అయినా ఇప్పటికి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. తాజాగా తాను ప్రగ్నెంట్ అనే సంగతి కూడా మర్చిపోయి యోగా ఆసనాలు వేస్తూ కనిపించింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
దీపికా పదుకొనే ఎప్పుడూ ఫిట్ గా ఉండాలని ప్రయత్నిస్తుంది.. అయితే ప్రస్తుతం ప్రగ్నెంట్ గా ఉన్నా కూడా ఫిట్నెస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదు.. తాజాగా తల్లులు ఇలాంటి ఆసనాలు వెయ్యొచ్చు అంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ తో పాటు, నెటిజన్స్ కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఆమె ఈ యోగాసనం తల్లులకు చాలా ఉపయోగకరమణి పేర్కొంది.. ఈ యోగా ను తల కిందకు పెట్టి, కాళ్లు పైకి పెట్టి వెయ్యాలి.. ఇలా వెయ్యడం వల్ల అనేక ప్రయోజనాలు ఉండటంతో పాటుగా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది..
అయితే దీపికా ప్రస్తుతం గర్భిణీ.. అయితే ఆమె లాంటి వాళ్లు ఈ ఆసనం వెయ్యాలంటే దిండు లాంటివి పెట్టుకొని మరీ వెయ్యాల్సి ఉంటుందని యోగా నిపుణులు చెబుతున్నారు.. ఈ యోగ వల్ల తల్లులకు కండరాలు బిగుతుగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు పుట్టబోయే బిడ్డకు మంచిదట.. సుఖ ప్రసవం కూడా అవుతారని చెబుతున్నారు.. అయితే ఈ విషయం పక్కన పెడితే దీపికా ఇప్పుడు రిస్క్ తీసుకోవడం అవసరమా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.. ఈ విషయం పై ఆమె భర్త కూడా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది.. బేబీ పుట్టిన తర్వాత ఇలాంటివి చెయ్యాలనే కండిషన్ కూడా పెట్టినట్లు తెలుస్తుంది.. దీపికా కల్కి 2 లో కూడా నటించబోతుందని తెలిసిందే.. రణవీర్ కూడా వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు..
View this post on Instagram