Mohan Babu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మంచు మోహన్ బాబు మాత్రమే కాకుండా ఫ్యామిలీ అంతా కూడా తాము ఏదో పైనుంచి ఊడి పడ్డాము అనే ఫీలింగ్ లో ఉంటారు. ఇకపోతే ఈ ఫ్యామిలీ ఒక హిట్ సినిమా చూసి చాలా ఏళ్లయింది. ప్రాపర్ గా ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఒకరు కూడా ఇప్పుడు ఫామ్ లో లేరు. రీసెంట్ గా ఎన్నో అంచనాలతో మధ్య వచ్చిన జిన్నా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇకపోతే చాలామంది ఇప్పుడు ఉన్న ప్రేక్షకులకి మోహన్ బాబు ని కలెక్షన్స్ కింగ్ అని ఎందుకు అంటారో కూడా తెలియదు.
మోహన్ బాబు చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ సాధించిన, ఇప్పుడు ప్రేక్షకులు చూస్తున్నప్పుడు అవి ఆనందాన్ని కలిగించినా కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే మోహన్ బాబు వ్యక్తిగత జీవితంలో బ్రతికే విధానం. మోహన్ బాబు మాట్లాడుతున్న ప్రతిసారి కూడా తన మాటల్లో అహంకారం బయటపడుతూ ఉంటుంది. రోబో సినిమా ఆడియో లాంచ్ కి రజనీకాంత్ హాజరైనప్పుడు రజినీకాంత్ ని వాడు వీడు అని అన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆన్ స్టేజ్ పై అలా మాట్లాడుతూ మోహన్ బాబు అంటూ చెప్పుకొచ్చారు.
అలానే ఒక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు కంటే కూడా తన గొప్ప నటుడని చాలాసార్లు చెప్పుకున్నాడు. అయితే ఈ మోహన్ బాబు కామెంట్స్ కి ఏఎన్ఆర్ స్పందిస్తూ మోహన్ బాబు ఒక పిచ్చోడంటూ వదిలేశారు. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ మోహన్ బాబు పైన ఒక రేంజ్ లో విడిచిపడ్డారు. ఇకపోతే కొన్ని సందర్భాల్లో రజినీకాంత్ అప్పుడప్పుడు వచ్చి నా కాళ్లు మొక్కుతాడు సరదాకి అని చెప్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా మోహన్ బాబుకి ఆ ఫ్యామిలీకి తీవ్రమైన నెగిటివిటీని తీసుకొచ్చాయి.
ఇకపోతే మోహన్ బాబుని చాలామంది డబ్బా రాయుడు అని పిలుస్తుంటారు. ఇక రీసెంట్ గా రజనీకాంత్ తో ఎయిర్పోర్టులో దిగిన ఒక పిక్ షేర్ చేశాడు మోహన్ బాబు. అయితే ఈ పిక్ కింద కామెంట్స్ లో చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కొంపదీసి కన్నప్పలో రోల్ చేయమని కూడా అడగలేదు కదా అంటూ మోహన్ బాబుపై సెటైర్లు వేస్తున్నారు. కొందరైతే మాత్రం వీడు మళ్ళీ వచ్చేసాడురా బాబాయ్ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా స్నేహమేరా జీవితం…@rajinikanth pic.twitter.com/rG5izlETSe
— Mohan Babu M (@themohanbabu) July 5, 2024