Star Celebrities.. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకరిని ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత.. పిల్లలకు జన్మనిచ్చి.. ఆ తర్వాత విభేదాలు వచ్చి విడిపోతూ ఉంటారు.. ఇక ఆ తర్వాత తమ బిడ్డలకు ఒక తండ్రి కావాలి అని మరొక వివాహం చేసుకుంటారు.. ఆ తర్వాత ఆ భర్తతో కూడా పిల్లలు కన్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు .. ముఖ్యంగా రాధికను మొదలుకొని.. చిరంజీవి కూతురు శ్రీజ వరకు ఇద్దరు భర్తలతో పిల్లలు కన్న సెలబ్రిటీస్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.. మరి వారు ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
రాధిక శరత్ కుమార్:
1980 – 1990 మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది రాధిక శరత్ కుమార్. ముఖ్యంగా ఎన్టీఆర్ , ఏఎన్నార్లతో పాటు చిరంజీవి , బాలకృష్ణ వంటి రెండు జనరేషన్లో హీరోలతో కూడా కలిసి నటించిన ఈమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఈమె నిర్మాత కూడా పలు చిత్రాలకు సొంత బ్యానర్లో నిర్మాతగా వ్యవహరిస్తూ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసింది. ఇక రాధిక వ్యక్తిగత విషయానికి వస్తే.. 1985లో కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రతాప్ పోతన అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆయనతో ఏడాది వ్యవధిలోనే విడాకులయ్యాయి. అనంతరం 2001లో మరో నటుడైన శరత్ కుమార్ ను వివాహం చేసుకుంది. ఇకపోతే పెళ్లయిన ఏడాదిలోపే గర్భవతి అయిన ఈమె మొదటి భర్తతో ఒక కొడుకును కన్నట్లు సమాచారం. ఇక శరత్ కుమార్ ను వివాహం చేసుకున్న తర్వాత రోహిత్ అనే అబ్బాయి జన్మించారు.. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ విషయానికొస్తే.. ఈమె శరత్ కుమార్ మొదటి భార్య కూతురు కావడం గమనార్హం.
సౌందర్య రజినీకాంత్:
సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ పలు రంగాలలో రాణిస్తోంది. గ్రాఫిక్ డిజైనర్ గా , నిర్మాతగా, దర్శకురాలిగా పనిచేస్తున్న ఈమె కొచ్చిడయాన్ , విఐపి వంటి చిత్రాలకు దర్శకత్వం కూడా వహించింది. ఇక 2010లో అశ్విన్ రామ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఈమె.. 2017 లో విడాకులు తీసుకుంది. అయితే వీరికి వేద్ అనే అబ్బాయి కూడా జన్మించారు. ఆ తర్వాత రెండో వివాహంగా విశాగన్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా.. రెండో భర్తతో మరో కొడుకు జన్మించాడు.
కొణిదెల శ్రీజ:
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. చదువుకునే రోజుల్లోనే తన క్లాస్మేట్ అయిన శిరీష్ భరద్వాజ్ ను 2007లో ఆర్య సమాజంలో రహస్యంగా వివాహం చేసుకున్న ఈమె.. ఒక బిడ్డ నివృతి జన్మించిన తర్వాత 2011లో విడిపోయారు. అనంతరం 2016లో నటుడు కళ్యాణ్ దేవ్ ను మళ్లీ వివాహం చేసుకుంది.. వీరికి 2018లో నవిష్క అనే అమ్మాయి పుట్టింది.. ఇప్పుడు శ్రీజ , కళ్యాణ్ దేవ్ కూడా విడివిడిగా ఉంటున్నారు. శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ ఇటీవలే హార్ట్ ఎటాక్ తో మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు కూడా శ్రీజ వద్ద పెరుగుతున్నారు.