VishwakSen: ప్రముఖ యంగ్ హీరో విశ్వక్ సేన్ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు త్వరలోనే లైలా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. మరొకవైపు ఈ సినిమా నుంచీ విశ్వక్ క్యారెక్టర్ కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్.. చేయగా అందులో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఈయన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు అమ్మాయిలు , హీరోయిన్లు సైతం కుళ్ళుకునేలా ఆ పోస్టర్ను అద్భుతంగా తీర్చిదిద్దారు.. అంత అందంగా లేడీ గెటప్ లో ఆకట్టుకున్నారు విశ్వక్ సేన్. ఇదిలా ఉండగా ఒక వారం క్రితం తన సోషల్ మీడియా ఖాతా అయిన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను ఆయన క్లోజ్ చేశారు.. దీంతో అభిమానులు కంగారు పడ్డారు.. ఇంత సడన్గా సోషల్ మీడియా నుండి అవుట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది.. ?అసలు విశ్వక్ ఇన్స్టా అకౌంట్ కి ఏమైంది..? ఎవరైనా హ్యాక్ చేశారా? అంటూ పలు రకాల అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇన్స్టా అకౌంట్ క్లోజ్.. అందుకేనా..
అయితే ఇన్స్టా అకౌంట్ సడన్ గా క్లోజ్ చేయడానికి కారణం సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చే బ్యాచ్ గురించి ఒక యూట్యూబర్ చేసిన వీడియో గురించి ప్రస్తావిస్తూ… ఇంకా విడుదల కానీ కల్కి సినిమా గురించి ఎందుకు అప్పుడే రివ్యూ ఇస్తున్నారు.. దమ్ముంటే ఒక షార్ట్ ఫిలిం చేసి చూపించండి అంటూ కౌంటర్ వేశాడు.. దానికి యూట్యూబర్ కూడా అదే రేంజ్ లో సమాధానం ఇచ్చాడు. ఈ వివాదం జరిగిన కొద్ది రోజులకే ఇన్ స్టా అకౌంట్ నుంచి బయటకు వచ్చేశారు విశ్వక్ సే.. దీంతో కొందరేమో ఈ వివాదం కారణంగానే ఆయన అకౌంట్ నుంచి బయటకు వచ్చారని కామెంట్ లు.. చేస్తుంటే మరి కొంతమంది విశ్వక్ సేన్ సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు.. మళ్ళీ తన సినిమా విడుదల సమయానికి ఇన్ స్టా కి వస్తారు అని అభిప్రాయపడ్డారు.. అయితే ఇప్పటివరకు ఆ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు విశ్వక్ సేన్.. కానీ తాజాగా మరో పోస్ట్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. అసలు తాను ఎందుకు ఇన్స్టా అకౌంట్ నుంచి బయటకు వచ్చాను..? అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
డీయాక్టివేట్ పై క్లారిటీ..
“గత కొద్ది రోజులుగా ఉన్న ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను ఎందుకు డీయాక్టివేట్ చేశాను అని అభిమానులు వరుసగా మెసేజ్లు చేస్తున్నారు.. నేను కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను .. నాకు ఏదో హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకోవడం లేదు..ఇది ఒక చిన్న విరామం మాత్రమే.. ఇందులో భాగంగానే నా ఇంస్టాగ్రామ్ ను డీయాక్టివేట్ చేయడం జరిగింది.. నా ట్విట్టర్ హ్యాండిల్ ని కూడా నా టీమ్ మేనేజ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఉంటేనే జీవితం ముందుకు సాగుతుందని నేను అనుకోవట్లేదు.. అందుకే ఈ సోషల్ మీడియాను కొంత వరకే సీరియస్ గా తీసుకోండి .. నేను నా నెక్స్ట్ మూవీ రిలీజ్ తర్వాత తిరిగి సోషల్ మీడియాలోకి రావచ్చు రాకపోవచ్చు” అంటూ విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ట్విట్టర్ ద్వారా ఈయన షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మొత్తానికైతే అభిమానులకు పక్కా క్లారిటీ ఇచ్చేశారు విశ్వక్ సేన్..
Hey everyone, just a heads up—I posted a story about starting a social media detox. It’s a small break from Instagram, nothing to worry about. Try being productive during this time! My team mostly manages my Twitter, so don’t stress over my Instagram deactivation. Lately, I’ve…
— VishwakSen (@VishwakSenActor) July 5, 2024