Raj Tarun: రాజ్ తరుణ్ లవర్ లావణ్య ఆ స్టార్ హీరోయిన్ చెల్లెలేనా..?

Raj Tarun: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పైన నిన్నటి రోజున పోలీస్ స్టేషన్ లో లావణ్య అనే యువతి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఈ హీరో పేరు వైరల్ గా మారింది. అయితే లావణ్య ఎవరో కాదు.. హీరో రాజ్ తరుణ్ మాజీ లవర్ అన్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా వీరిద్దరికి పది సంవత్సరాలకు పైగా పరిచయం ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లావణ్య రాజ్ తరుణ్ కి చాలా సహాయం చేశాను అని ..తనని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు .. ముఖ్యంగా ఒక నటిపై ప్రేమతో నన్ను దూరం పెట్టేసాడు అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది.

Raj Tarun: Is Raj Tarun's lover Lavanya the star heroine's sister?
Raj Tarun: Is Raj Tarun’s lover Lavanya the star heroine’s sister?

రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య మాధవీ లత చెల్లెలా..

ముఖ్యంగా ఒక హీరోయిన్ తో సంబంధం పెట్టుకోవడం వల్ల తనని దూరం పెట్టాడని.. చివరికి తనను చంపుతానంటూ బెదిరించారంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదులు తెలియజేసినట్లు సమాచారం. అయితే హీరో రాజ్ తరుణ్ మాత్రం తను చెప్పింది అబద్ధమని.. తనతో తనకి వివాహం కాలేదని.. లావణ్య పైన తాను లీగల్ గా పోరాటానికి వెళ్తానంటూ కూడా రాజ్ తరుణ్ నిన్నటి రోజున క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా లావణ్య గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతుంది.. అదేమిటంటే లావణ్య టాలీవుడ్ హీరోయిన్ అయిన మాధవి లత కి చెల్లెలు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

పేరు మార్చుకున్న లావణ్య..

మాధవి లత నచ్చావులే ,స్నేహితుడు, అతిధి తదితర చిత్రాలలో కూడా నటించింది. పొలిటికల్ పరంగా కూడా మాధవి లత యాక్టివ్గానే ఉంటుంది. మాధవి లత సినిమాల్లో నటిస్తున్న సమయంలో లావణ్యను అక్క అని పిలుస్తూ ఉండేదట.. తనని కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేలా సహాయం చేయమని మాధవి నీ గతంలో అడిగేదని సమాచారం. అయితే అందుకోసం లావణ్య తన పేరును కూడా అన్వికా రావుగా మార్చుకున్నట్లు సమాచారం. అలా పేరు మార్చుకున్న తర్వాత ఒక సినిమా షూటింగ్ కూడా పూర్తయిందని కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదట.

- Advertisement -

లావణ్య నటించిన సినిమాలు..

అన్వికా రావు కూడా చిన్న చిన్న పాత్రలలో పలు సినిమాలలో నటించిందట.. డైరెక్ట్ ఉదయ్ నందనవనం దర్శకత్వంలో 2015లో వచ్చిన శంకరాభరణం అనే చిత్రంలో అన్వికారావు చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత ఈమె ఇండస్ట్రీలో మాధవి లత చెల్లెలు గానే పరిచయం కావడంతో అందరూ ఈమె మాధవి లతా చెల్లెలే అనుకుంటూ ఉండేవారట. వాస్తవానికి ఈమె మాధవి లతాకు నిజమైన చెల్లెలు కాదని తెలుస్తోంది. గతంలో మాధవి లత ఇంటికి అన్విక (లావణ్య) రాజ్ తరుణ్ తో కలిసి వెళ్లినట్లుగా సమాచారం.

రాజ్ తరుణ్ పై ఫిర్యాదు.. స్పందించిన హీరో..

అయితే ఆ తర్వాత లావణ్య బయటికి వచ్చి హీరో రాజ్ తరుణ్ పైన ఫిర్యాదు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాజ్ తరుణ్ హీరోయిన్ తో తిరుగుతూ ఉన్నాడని…తనని వదిలించుకోవాలని చూస్తున్నాడు అంటూ లావణ్య ఇటీవలే ఫిర్యాదులో కూడా తెలియజేసింది. ఇక దీనిపై రాజ్ తరుణ్ కూడా స్పందిస్తూ లావణ్యతో పరిచయం ఉన్న విషయం తెలిసిందే కానీ ఆమె వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అందుకే ఆమెకు దూరంగా ఉన్నాను అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. మరి ఇందులో ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో తెలియాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు