Nagarjuna : ఇలాంటి టైం లో నాగ్ సత్తా చూపిస్తే తిరుగుండదు..

Nagarjuna : పాన్ ఇండియా వైడ్ గా భారతీయ సంప్రదాయాల ఆధారంగా తెరకెక్కే సినిమాలకు ఎప్పుడూ పాజిటివ్ బజ్ ఉంటుందని తెలిసిందే. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, ఇతిహాస, భక్తిరసాలలో, అలాగే ఫాంటసీ, చారిత్రాత్మక జోనర్ లో వచ్చే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని తెలిసిందే. అయితే వాటిని ఏమాత్రం వక్రీకరించినా అంతే దారుణంగా ప్రేక్షకులు విమర్శిస్తారు. రీసెంట్ గా వచ్చిన కల్కి థియేటర్లలో ఓ వర్గం ప్రేక్షకులని ఆకట్టుకుంటూనే, మరో వర్గం నుండి విమర్శలూ ఎదుర్కొంటుంది. ఇదిలా ఉండగా ఈ మధ్య ఇతిహాసాలకు సంబంధించిన జోనర్ లో, అలాగే డివోషనల్ టచ్ తో వస్తున్న సినిమాలు బాగా ఆడుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య వచ్చిన కార్తికేయ2, ఈ ఇయర్ మొదట్లో వచ్చిన హనుమాన్, అలాగే రీసెంట్ గా విడుదలైన కల్కి2898AD సినిమా ఏ స్థాయిలో థియేటర్లలో ఆడియన్స్ ని అలరిస్తుందో చెప్పనక్కర్లేదు. త్వరలో రాబోతున్న విశ్వంభర కూడా డివోషనల్ టచ్ ఇస్తూ ఫాంటసీ జోనర్ లో తెరకెక్కుతుంది.

Nagarjuna Latest Upcoming Movies Updates

ఇలాంటి టైం లో నాగ్ సత్తా చూపిస్తే..

అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో డివోషనల్ కంటెంట్ జోనర్ లో రెగ్యులర్ గా సినిమాలు వచ్చేవి. ఈ మధ్య బాగా తగ్గిపోయాయి. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ఇప్పుడున్న హీరోల్లో నాగార్జున డివోషనల్ జోనర్ లో సినిమాలు బాగా తీసేవాడు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు మాదిరిగానే, డివోషనల్ జోనర్ లో మంచి సినిమాలు తీసాడు. రొమాంటిక్ హీరోగా స్టార్ డమ్ ఉన్న రోజుల్లోనే అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి చిత్రాలు తీసి ఇండస్ట్రీలో నాగార్జున అద్భుతమైన విజయాలు సాధించాడు. అలాగే షిరిడీసాయి, ఓం నమో వెంకటేశాయ కూడా ఓ మోస్తరు ఆదరణ దక్కించుకున్నాయి. అయితే తెలుగు సినిమాలు డివోషనల్ టచ్ తో తెరకెక్కి పాన్ ఇండియా లెవెల్ లో అదరగొడుతున్న ఇలాంటి సమయంలో నాగార్జున (Nagarjuna) ఒక ఇతిహాస భక్తిరస నేపథ్యంలో మంచి కంటెంట్ తో సినిమా తీస్తే పాన్ ఇండియా వైడ్ గా ఆ సినిమా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందని, నాగార్జునకి అసలైన బ్రేక్ వస్తుందని అంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా డివోషనల్ కంటెంట్ తో నార్త్ ప్రేక్షకులని కొంచెం మెప్పించినా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

- Advertisement -

సెట్స్ పై నాగ్ సినిమాలు..

ఇకపోతే నాగార్జున బంగార్రాజు తర్వాత వరుస ప్లాప్ లు అందుకోగా, తాజాగా నా సామిరంగ తో సక్సెస్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ధనుష్ తో కలిసి కుబేర మల్టీస్టారర్ చేస్తున్న నాగార్జున త్వరలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని టాక్. అలాగే ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఏది ఏమైనా ఇలాంటి సమయంలో డివోషనల్ మూవీస్ లో నాగార్జున తనకున్న ఆదరణ ని గమనించి మళ్ళీ తనకు అచ్చోచ్చిన జోనర్ లో మూవీస్ చేస్తే నాగ్ మళ్ళీ మంచి ట్రాక్ లోకి రావొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు