SS.Rajamouli:ఫ్యాన్స్ కి ఆగస్టు 2న సర్ప్రైజ్.. ఏమిటంటే..?

S.S.Rajamouli: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు ఫ్లాపులు లేని డైరెక్టర్లలో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నారు.. సినీ పరిశ్రమని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన అరుదైన డైరెక్టర్ గా గుర్తింపు పొందారు రాజమౌళి. RRR చిత్రంతో ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకునేలా చేశారు. అందుకే రాజమౌళితో ఎలాంటి వారైనా సరే సినిమా తీయడానికి ఎన్ని రోజులైనా సరే డేట్ లను కేటాయిస్తూ ఉంటారు. ఇలాంటి డైరెక్టర్ జీవిత చరిత్రను డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేయబోతున్నారు నెట్ ఫ్లిక్స్.. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

SS.Rajamouli: Surprise for fans on August 2.. What..?
SS.Rajamouli: Surprise for fans on August 2.. What..?

రాజమౌళి జీవిత చరిత్రను డాక్యుమెంటరీగా..

అనుపమ చోప్రా రాజమౌళి జీవిత చరిత్రను డాక్యుమెంటరీగా ఆగస్టు 2వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ డాక్యుమెంట్రీలో జేమ్స్ కామరూన్, జోరస్సో, కరణ్ జోహార్ వంటి వారు అలాగే రాజమౌళి సన్నిహితులలో కొందరైన జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ,రానా ,రామ్ చరణ్ వంటి వారు కూడా ఇందులో పలు విషయాలను తెలియజేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ తో కలిసి ఈ డాక్యుమెంటరీ ని రూపొందించినట్లుగా తెలుస్తోంది.ఈ ఇంటర్వ్యూలో తెరవెనక ఫుటేజ్ లతో రాజమౌళిని హైలెట్ చేసేలా చూపించబోతున్నారట.

అనుపమ చోప్రా నేతృత్వంలో..

మాస్టర్స్ డాక్ సిరీస్ లో భాగంగా రాజమౌళి జీవిత చరిత్రని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రాజమౌళి ఇండియన్ సినిమా చరిత్రని మార్చగలిగిన డైరెక్టర్ గా పేరు పొందారు. అందుకే ఈయన బయోపిక్ చరిత్రను చూపిస్తున్నామంటూ అనుపమ చోప్రా తెలియజేశారు. రాజమౌళి యొక్క పనితనం , నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను బాగా ఆకర్షించిందనీ.. ఆయన కెరియర్ కూడా ఒక అసాధారణమైన కెరియర్ అని.. సినీ ప్రపంచం పైనే ఆయన చూపించిన విశ్వాసం ఇందులో హైలెట్ గా నిలుస్తుంది అంటూ తెలియజేశారు అనుపమ చోప్రా. ఇలాంటి గొప్ప డైరెక్టర్ యొక్క బయోపిక్ తీయడం చాలా ఆనందంగా ఉందని. అలాగే నెట్ ఫ్లిక్స్ తో పనిచేయడం మరింత ఆనందంగా ఉందంటూ తెలిపారు.

- Advertisement -

మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ నాయర్ మాట్లాడుతూ..

అలాగే మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ నాయర్ మాట్లాడుతూ.. రాజమౌళి వంటి డైరెక్టర్ల డాక్యుమెంటరీ తీయడంతో పాటుగా నెట్ ఫ్లిక్స్ తో కలిసి పని చేయడం మరింత ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. రాజమౌళి వంటి డైరెక్టర్ భారతీయ సినీ నిర్మాణంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని ఆయన అందించిన బాహుబలి, RRR వరకు అతని కళాత్మక అభివృద్ధిని ప్రపంచానికి పరిచయం చేయడం చాలా సంతోషకరంగా ఉందంటూ తెలిపారు.

రాజమౌళి బయోపిక్ తీయడం చాలా ఆనందంగా ఉంది..

ఇక నెట్ ఫ్లిక్స్ ఇండియన్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మౌనిక షేర్గిల్ ఇలా మాట్లాడుతూ.. సినిమా ప్రతిభతో దూరదృష్టి గల కథలతో ఇండియన్ సినిమాలను ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి డైరెక్టర్ రాజమౌళి అని.. అలాగే ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడేటువంటి డైరెక్టర్లలో రాజమౌళి కూడా ఒకరని.. అలాంటి డైరెక్టర్ యొక్క జీవిత చరిత్ర ను డాక్యుమెంటరీ రూపంలో తీయడం చాలా ఆనందంగా ఉందంటూ తెలిపారు. ఏదిఏమైనా రాజమౌళి అభిమానులకు ఇది గొప్ప సర్ప్రైజ్ అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు