South Movies : ఈ మూవీస్ థియేటర్‌లో హిట్.. కానీ ఓటీటీకి మాత్రం దూరం… ఒక్కో సినిమాకు ఒక్కో కారణం..?

South Movies.. సాధారణంగా ఒక సినిమా విడుదలయ్యి థియేటర్ లో హిట్ అయితే విడుదలైన ఆరు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తూ ఉంటుంది.. ఒకవేళ అదే సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయితే రెండు వారాలకే ఓటీటీలో సందడి చేస్తుందనడం లో సందేహం లేదు.. కానీ ఇక్కడ కొన్ని సౌత్ చిత్రాలు మాత్రం విడుదలై నెలలు గడుస్తున్నా.. ఇంకా ఓటీటీకి మాత్రం నోచుకోలేదు. అయితే అలా థియేటర్లలో హిట్ అయ్యి.. ఓటీటీ కి రాకపోవడానికి ఒక్కో సినిమాకు ఒక్కో కారణం.. మరి అలా థియేటర్లలో హిట్ అయ్యి ఓటీటీకి ఆమడ దూరంగా ఉన్న చిత్రాలు ఏంటి..? అసలు ఇంకా ఓటీటీకి రాకపోవడానికి గల కారణం ఏమిటి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

అయలాన్:

South Movies : These movies are hits in theatres.. but far from OTT... There is a different reason for each movie..?
South Movies : These movies are hits in theatres.. but far from OTT… There is a different reason for each movie..?

బై లింగ్వల్ మూవీ అయిన అయలాన్.. తెలుగులో సంక్రాంతి పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. 2024 జనవరి 12వ తేదీన కేవలం తమిళ్లో మాత్రమే విడుదల చేశారు.. కేజేఆర్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ ఎక్స్ స్టూడియోస్, ఆది బ్రహ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కోటపాడి జే. రాజేష్ నిర్మించిన ఈ సినిమాకి ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించగా.. శివ కార్తికేయన్ , రకుల్ ప్రీత్ సింగ్ , ఇషా కొప్పికర్, శరత్ కేల్కర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను తెలుగులో జనవరి 26న గంగా ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా మహేశ్వర్ రెడ్డి సినిమాను విడుదల చేశారు.. అయితే ఈ సినిమా తమిళ్ వెర్షన్ ఫిబ్రవరి 9 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీ లో స్ట్రీమింగ్ ప్రారంభం అవ్వగా.. ఇప్పటి వరకు తెలుగు వెర్షన్ ఓటీటీకి నోచుకోలేదు.

లాల్ సలాం:

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించిన చిత్రం లాల్ సలాం.. రజినీకాంత్, విష్ణు విశాల్, జీవిత, విక్రాంత్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను 9 ఫిబ్రవరి 2024 న పాన్ ఇండియా భాషల్లో విడుదల చేశారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయకపోవడం గమనార్హం. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయని.. ఓటీటీలో వచ్చినా హిట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు అని అందుకే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయలేదు అని సమాచారం.

- Advertisement -

రజాకార్:

యాట సత్యనారాయణ దర్శకత్వంలో .. హైదరాబాద్ సంస్థానంలో 1940 లలో తెలంగాణ ప్రాంతంలో రజాకార వ్యవస్థపై సమర్ వీర్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ బ్యానర్ పై.. గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన ఈ సినిమా
15 మార్చ్ 2024 న విడుదలైంది ఇందులో బాబీ సింహ, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పటివరకు ఓటీటీకి నోచుకోలేదు.

ది గోట్ లైఫ్:

బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్, జిమ్మీ జీన్ లూయిస్, కె ఆర్ గోకుల్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం..
28 మార్చ్ 2024 న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది కానీ ఇప్పటివరకు ఓటీటీకి నోచుకోలేదు.

ఏజెంట్:

వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా వచ్చిన చిత్రం ఏజెంట్. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో కొచ్చింది.. ఈ సినిమాలో మమ్ముట్టి , సాక్షి వైద్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఓటిటికి రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు